రవితేజ కి రాజా ది గ్రేట్ లాభమా? నష్టమా? 2 వ రోజు కలెక్షన్స్

మాస్ మహారాజా రవితేజ ‘రాజా ది గ్రేట్’ దీపావళి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ షోతోనే హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. అంధుడిగా రవితేజ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. తొలిరోజు వసూళ్లు కూడా బాగున్నాయి.
ఏరియాల వారీగా చూస్తే :
* నైజామ్ – రూ. 1.95 కోట్లు
* సీడెడ్ – రూ. 76 లక్షలు
* ఉత్తరాంధ్ర – రూ. 60 లక్షలు
* పశ్చిమ గోదావరిలో రూ. 30 లక్షలు
* తూర్పు గోదావరిలో రూ. 40 లక్షలు
* కృష్ణాలో రూ. 29 లక్షలు
*. గుంటూరు – రూ. 50 లక్షలు
* నెల్లూరులో రూ 22 లక్షలు
మొత్తంగా తెలుగురాష్ట్రాల్లో తొలిరోజు 5.02కోట్లని రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా చూసే.. రాజా ది గ్రే దాదాపు రూ. 10కోట్ల గ్రస్స్ వసూలు చేసినట్టు చెబుతున్నారు.ఐతే రెండో రోజు కూడా అంచనాలకు తగట్టు 3.22కోట్లని రాబట్టినట్టు తెలుస్తోంది.దీపావళి సందర్భంగా “రాజా ది గ్రేట్” కి కలెక్షన్స్ వర్షం కురిసిందనే చెప్పాలి.

Leave a comment