Gossipsరూటు మార్చిన పవన్..!

రూటు మార్చిన పవన్..!

ప‌వ‌ర్ స్టార్ త‌న రూటు మార్చారు సినిమాల విష‌యంలోనూ పొలిటిక‌ల్ మేట‌ర్స్ లోనూ వ‌రుస నిర్ణ‌యాలు వెలువ‌రిస్తున్నారు.
కెరియర్ వేగాన్ని పెంచుతున్నారు జ‌న‌సేన‌ని ప‌టిష్టం చేసేందుకు పాదం క‌దుపుతున్నారు.
త్వ‌ర‌లో ఆయ‌న ప్లీన‌రీని నిర్వ‌హించ‌నున్నారు.అయితే ఈ స‌మావేశాన్ని ఎప్పుడు? ఎక్కడ? ఎలా ?  నిర్వహించాలనే అంశంపై పూర్తిగా క్లారిటీ రాకపోయినా.. పార్టీని బలోపేతం చేసే దిశగా మా త్రం పవన్ అడుగులు వేస్తున్నారని మాత్రం సుస్ప‌ష్టం.  జనసేన ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకూ  జనసేన పార్టీ కోర్ కమిటీ భేటీ జరగలేదు.
ఈ తరుణంలో ఆదివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ముఖ్య ప్రతినిధులతో పవన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో వచ్చే 6 నెలల్లో పార్టీ పరంగా నిర్వహించనున్న ముఖ్య కార్యక్రమాలపై వపన్ చర్చించారు. అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో ఎప్పుడు పర్యటించాలనే అంశంపైనా జనసేన కోర్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. 2019లో ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా ముందడుగు వేయాలనే దానిపైనా ఈ భేటీ చర్చించినట్లు సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news