Gossipsఆ సినిమా అసలు చేయను..

ఆ సినిమా అసలు చేయను..

దెయ్యం అంటే నానికి బ‌య్యం అదేంటంటే అంటే అంటాడు ఈ నాని బీబీఎం త్వ‌ర‌లో మిడిల్ క్లాస్ అబ్బాయిగా మ‌న ముందుకు రానున్న ఈ కుర్ర హీరో వ‌రుస అవ‌కాశాలు అందుకుని సినిమా మీద సినిమా చేసుకుపోతున్నాడు మినిమం గ్యారంటీ ఉన్న హీరో గా త‌న‌దైన గుర్తింపు పొందుతున్నాడు

ఇంత‌కూ మేట‌ర్ ఏంటంటే..

ఇటీవల జరిగిన గృహం సినిమా ఆడియో ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హీరో నాని హాజరయ్యాడు. అంతే కాకుండా హీరో  సిద్ధార్థ్‌ని ఇంటర్వ్యూ చేశా డు.ఇంటర్వ్యూలో భాగంగా గృహం సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నాడు  నానీ. అయితే ఈ ఇంటర్వ్యూలో నానిని సిద్ధార్థ్ ఓ ఇంట‌స్ట్రింగ్ పాయింట్ రైజ్ చేశాడు. “నాని ఎప్పుడు హారర్ ఫిలింలో చేస్తాడు? చేస్తే ఎందుకు చేస్తాడు? చెయ్యకపోతే ఎందుకు చెయ్యడు?” అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా నాని “నేను హారర్ ఫిలిం లైఫ్‌లో చెయ్యను. ఛస్తే చెయ్యను. ఎందుకు చెయ్యను అనడానికి కూడా నా దగ్గర లాజిక్ ఉంది.

నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. ప్రతి హారర్ సినిమా చూస్తాను.ఆ..సినిమాలు చూస్తూ నెక్ట్స్ ఏం జరగబోతోందన్న టెన్షన్‌ను నేను ఎంజాయ్  చే స్తాను.నేను హారర్ ఫిలిం చేయడం వల్ల నేను హారర్ ఫిలింని ఎంజాయ్ చేయడం మిస్ అవుతాను. అందుకే నేను హారర్ ఫిలిం చెయ్యను” అని బదులిచ్చాడు.కాగా త్వ‌ర‌లో నాని నాగ్ క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నారు. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై ఈ సినిమా రూపొంద‌నుంది. భ‌లే మంచి రోజు ఫేం శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news