జవాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

Jawan to hit screens on dec 1st

ఎట్ట‌కేల‌కు జ‌వాన్ రాక షురూ.న‌వంబ‌ర్ కాదు డిసెంబ‌ర్ నెల‌లో ఎంట్రీ చ‌లిగాలులు వీచే స‌మ‌యాన సుప్రీం హీరో అందం హిందోళం అని పాడ‌నున్నాడు మెహ్రీన్‌తో ఆమె అందం అత‌డి అభిన‌యం సినిమా స‌క్సెస్ కి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ కావ‌డం ఖాయం.

వివరాలిలా..: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం ‘జవాన్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వ చ్చిందని నిర్మాతలు చెబుతున్నారు. టీజర్ లో మాస్ కమర్షియల్ అంశాల్ని మేళవించడంతో పాటు… కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు. కృతజ్ఞత అంటూ, దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ కి అం దరూ కనెక్ట్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ ని కొత్తగా చూపించబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. సాయి ధరమ్ ఇప్పటివరకు చేసిన కమర్షియల్ చిత్రాలు ఒక ఎత్తయితే…జవాన్‌లో చేసిన క్యారెక్టర్ మరో ఎత్తు. టీజర్లో తమన్ రీ రికార్డింగ్, కెవి గుహన్ సినిమాటోగ్రఫి హైలైట్‌గా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ చిత్ర ప్రమోషన్ ను సైతం వినూత్న రీతిలో… ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. పబ్లిసిటీలో మరో కోణాన్ని ఈ చిత్రం ద్వారా ఆవిష్కరించబోతున్నారు. కాగా నిర్మాత కృష్ణ‌, దిల్ రాజు ఇలా అంతా సినిమా రిజ‌ల్ట్ పై సంతృప్తిగానే ఉన్నార‌ని టాక్.

Leave a comment