జ‌న‌తా గ్యారేజ్‌లో జ‌వాన్‌కి తుది మెరుగులు

ఓ సినిమాకు హిట్ ఫ‌ట్ అని టాక్ తెచ్చేది క‌థ ఒక్క‌టే కాదు టేకింగ్ కూడా! కేవ‌లం టేకింగ్ తోనే రామూ లాంటి ద‌ర్శ‌కులు పేరు తెచ్చుకున్న మాట ఎంతో నిజం. కానీ మెగా అల్లుడు జ‌వాన్ సినిమా మాత్రం అనుకున్నంత‌గా తెర‌కెక్క‌లేదు. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన ఈ సినిమాని మాట‌ల ర‌చ‌యిత బీవీఎస్ ర‌వి డైరెక్ట్  చేశారు. ఈ సినిమా ఔట్ పుట్ బాగుండ‌క‌పోవ‌డంతో రంగంలోకి  జ‌న‌తా గ్యారేజ్ ఫేం రైట‌ర్ కం డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌ని రంగంలోకి దించారు.

దిల్ రాజు కోరిక సినిమా చూసిన ఆయ‌న సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేయాల‌ని సూచించార‌ట‌! దీంతో ఆయ‌న చెప్పిన సూచ‌న‌లు మేర‌కు సినిమాని రీ షూట్ చేయాల‌ని చెప్పార‌ట దిల్ రాజు. వాస్త‌వానికి ఈ సినిమా సెప్టెంబ‌ర్ లో విడుద‌ల కావాల్సి ఉన్నా డిసెంబ‌ర్ కి వాయిదా ప‌డడానికి కార‌ణం కేవ‌లం ఔట్ పుట్ నచ్చ‌క‌నే!   ప్ర‌స్తుతం సాయి ధ‌ర‌మ్ తేజ్ వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు.

Leave a comment