జై లవ కుశ క్లోసింగ్ కలెక్షన్స్…బయర్స్ కి లాభమా?నష్టమా?

“జై లవ కుశ” సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోలి సారి త్రిపాత్రాభినయం చేసి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తోలి రోజు 46 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేసింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో విధ్వంసం సృష్టించింది ఈ చిత్రం. మెగా స్టార్ పేరు మీదున్న నాన్ బాహుబలి ఫుల్ టైం గ్రాస్ ను కూడా బ్రేక్ చేసి 165 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం. చాల సినిమాలు రిలీజ్ కావడం తో కొన్ని చోట్ల తప్ప చాల వరకు సినిమా బిజినెస్ క్లోసింగ్ కి వచ్చేసిందని చెప్పాలి .

85 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రానికి ఇప్పటివరకు 82.5 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 2.5 కోట్ల వరకు కలెక్ట్ చెయ్యాల్సి వుంది .సినిమా బిజినెస్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఇది సాద్య పడే అవకాశం లేదు . దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కొంత మేరకు లాస్ అయ్యే అవకాశం కనబడుతుంది .

నిజానికి ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ పెట్టిన బడ్జెట్ 26 కోట్లుగా చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు . అయితే ఆ బడ్జెట్లో ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ లేక పోవడం గమనార్హం. ఎన్టీఆర్ కు రెమ్యూనరేషన్ రూపం లో 20 కోట్లు వరకు ఇచ్చే ప్లాన్లో వున్నాడట కళ్యాణ్ రామ్. ఎటు చూసిన సుమారు 40 కోట్ల లాభంలో ఉన్న ప్రొడ్యూసర్ కొంత మేరకు డిస్ట్రిబ్యూటర్ల లాసులు భరించే ఆలోచనలో వున్నాడట. సో అల్ హ్యాపీ అన్న మాట .

ఏరియా వైస్ షేర్ కలక్షన్స్ ఇలా వున్నాయి..

నైజాం 16.9

సీడెడ్ 12.5

నెల్లూరు 2.9

కృష్ణ 4.9

గుంటూరు 7.1

వైజాగ్ 8.7

ఈస్ట్ గోదావరి 6.2

వెస్ట్ గోదావరి 4.2

AP & TS షేర్ 63.4

ఓవర్సీస్ 8.7

రెస్ట్ అఫ్ ఇండియా 10.3

వరల్డ్ వైడ్ టోటల్ 82.5 Cr

Leave a comment