Gossipsజై లవ కుశ బయ్యర్స్ సేఫా.. కాదా..! 13 రోజుల...

జై లవ కుశ బయ్యర్స్ సేఫా.. కాదా..! 13 రోజుల కలెక్షన్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జై లవ కుశ . రొటీన్ కధకి ఎన్టీఆర్ అపురూప నటనను జోడించి సూపర్ హిట్ కొట్టారని చెప్పాలి . ఈ చిత్రం 13  రోజులకు 127  కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ కెరీర్ లో 100 కోట్లు కలెక్ట్ చేసిన రెండవ చిత్రం గ రికార్డులు నెలకొల్పింది . జనతా గారేజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 137 గ్రాస్ వసూల్ చేసింది . ఇప్పుడు ఆ రికార్డు జై లవ కుశ బ్రేక్ చెయ్యడానికి మరెన్నో రోజులు పట్టదంటున్నారు ట్రేడ్ వర్గాలు .

అక్టోబర్ 2 తో దేశరా సెలవలు పూర్తి కావడంతో ఇక సినిమా పెద్దగా వసూల్  చెయ్యకపోవచ్చని అందరి అంచనా . అయితే వారందరి అంచనాలను తారుమారు చేస్తూ నిన్నా వరల్డ్ వైడ్ గ 1.7 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూల్ చేసింది ఈ చిత్రం.

జై లవ కుశ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో 55 కోట్ల షేర్ మార్క్ ను అందుకుందని సమాచారం . ఈ వారం కొత్త సినిమాలు ఏవి లేకపోవడం , ఈ చిత్రానికి ప్లస్ గ మారింది . ఇక ఈ వారాంతానికి బయ్యర్స్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితుల అంచనా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news