ఫ్లెక్సీ గొడ‌వ చూడ‌ర బాబు

ఫ్లెక్సీ గొడ‌వ చూడ‌ర బాబు
ఇంకా ఆయ‌న పార్టీలో చేర‌లేదు
మూడు రంగుల పార్టీ కండువా క‌ప్పుకోలేదు
ఆయ‌నకే ప‌ద‌వీ క‌ట్ట‌బెట్ట‌నూ లేదు
అప్పుడే సంద‌డి మొద‌లుపెట్టేశారు
రేవంత్ రెడ్డి మావోడే అంటూ ఫ్లెక్స్లీలు క‌ట్టేశారు
ఇదీ వ‌రంగ‌ల్ జిల్లా లో చోటుచేసుకున్న ప‌రిణామం.
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ పై రేవంత్ రెడ్డి ఫొటోను ముద్రించి కొత్త వివాదానికి తెర‌లేపారు. వరంగల్ నగరంలో హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వచ్చే మార్గంలో ఈ ఫ్లెక్సీని డీసీసీబీ మాజీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అనుచరులు క‌ట్టించిన ఈ ఫ్లెక్సీ క‌థ వార్త‌ల్లోకెక్కింది. రేవంత్ పార్టీలో చేర‌క‌మునుపే నేత‌లు ఇలా అత్యుత్సాహం చూప‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అన్న‌ది కొస‌రు ప్ర‌శ్న‌. మ‌రోవైపు రేవంత్ కాంగ్రెస్ నేత‌ల‌ను క‌లుస్తున్నారు. వ‌రుస భేటీల‌తో బిజీబిజీగా ఉన్నారు. అదేవిధంగా ఈ నెల 24న జ‌రిగే టీడీఎల్పీ స‌మావేశానికి కూడా ఆయ‌న హాజ‌రుకానున్నారు. ఇదే ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న విష‌యం. టీడీపీ నేత‌ల క‌ల‌వ‌ర‌పాటుకూ ఇదే ఓ కార‌ణం కూడా! పార్టీకి రాజీనామా చేయ‌కుండా కాంగ్రెస్ పెద్ద‌ల‌తో మాట్లాడ‌డం, తెలంగాణ నాయ‌కుల‌తో భేటీ కావ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అన్న‌ది వారు సంధిస్తోన్న సూటి ప్ర‌శ్న‌.
ఎంతైనా ఆయ‌న రూటే సెప‌రేటు!

Leave a comment