విజయ్ మెర్శల్‌ పై వైద్యులు కన్నెర్ర..!

తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ నటించిన తమిళ సినిమా మెర్శల్‌ రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం తెలుగులో అదిరిందిగా వస్తుంది.  తమిళనాట మొదటి వారం ఇప్పటి వరకు విజయ్ ఏ సినిమాకు రాని కలెక్షన్లు రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. తాజాగా ఈ సినిమా కొన్ని వివాదాల్లో చిక్కుకుంది.. ఇప్పటికే బిజేపి నాయకులు మెర్శల్‌ సినిమా తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని ఆరోపిస్తుంటే.. ఇప్పుడు వైద్యులు కన్నెర్ర చేశారు.

ఈ సినిమాను బహిష్కరిస్తున్నట్టు తమిళ వైద్యులు ప్రకటించారని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. తమను కించేపరిచేలా సినిమా తీశారని మండిపడ్డ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా పైరసీ లింకులను సోషల్ మీడియాలో షేర్‌ చేయాలని నిర్ణయించారు. మెర్శల్‌ పై మౌనపోరాటం చేస్తామని ప్రకటించారు.

ఇప్పటికే ఈ చర్యలు మొదలుపెట్టారని తెలుస్తుంది. అదే కొనసాగితే సినిమా కలక్షన్స్ మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఇక సినిమాలో కొన్ని డైలాగ్స్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ వస్తున్న కామెంట్స్ కు రజిని కబాలి దర్శకుడు పా.రంజిత్ ఖండించారు. సినిమాలో అంతగా అభ్యంతరమైన డైలాగులు ఏమి లేవని అన్నారు.

 

Leave a comment