Gossipsభారతీయుడు-2 కి తెలుగు నిర్మాత

భారతీయుడు-2 కి తెలుగు నిర్మాత

‘భారతీయుడు’కు సీక్వెల్‌ చేయాలని శంకర్‌- కమల్‌హాసన్‌ చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. అయితే పలు కారణాల వాళ్ళ వారి కలయిక కుదరలేదు. ఇక ఈ సినిమా వచ్చే అవకాశం లేనట్లే అనుకొని అందరూ ఆశలు వదులుకుంటున్న తరుణంలో ‘భారతీయుడు 2’ చేస్తున్నాం అంటూ దిల్‌ రాజు బృందం నుంచి ప్రకటన వచ్చింది. దీంతో ‘ఈ కాంబినేషన్‌ ఎలా కుదిరిందబ్బా’ అని ఆశ్చర్యపోయినవాళ్లు కొందరైతే… కమల్‌హాసన్‌ సరైన సమయంలో ‘భారతీయుడు 2’ చేస్తున్నారని అంటున్నారు. అంతగా చర్చనీయమైన . ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి.

‘భారతీయుడు 2’లో కమల్‌హాసన్‌ సరసన ఇద్దరు కథానాయికలు నటించబోతున్నారు. వీరి కోసం ఇప్పటికే కొన్ని పేర్లు అనుకున్నట్లు సమాచారం. కొత్త నాయికల్ని కాకుండా సీనియర్లనే ఎంచుకుంటారట. దక్షిణాదిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న చిత్రమిది. రూ.200 కోట్లకుపైనే ఈ సినిమాకు బడ్జెట్‌గా అనుకుంటున్నారు.

పారస్తుతానికి శంకర్ రోబో-2 తో బిజీ గ ఉన్నందున  , వచ్చే ఫిబ్రవరిలో సినిమా ప్రీప్రొడక్షన్‌ పనులు మొదలవుతాయి. వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసి సినిమాను పట్టాలెక్కించే ఉద్దేశంలో శంకర్‌ అండ్‌ టీమ్‌ ఉన్నారట. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఆ తర్వాత మరిన్ని ముఖ్య  భాషలన్నింటిలోకి సినిమాను డబ్ చేస్తారని సమాచారం . షూటింగ్ స్టార్ట్ కాకముందే  సంచలనాలు సృష్టిస్తున్న కమల్‌-శంకర్‌ కాంబినేషన్  తర్వాత ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news