బాలయ్య-కేఎస్‌.ర‌వికుమార్… మధ్యలో ఎన్టీఆర్ టైటిల్

యూత్ తో సమానం గ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నాడు.హిట్లు మీద హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ.ఇప్పటికే 101 సినిమాలు పూర్చి చేసుకొని ప్రస్తుతం 102 సినిమా షూటింగ్ లో వున్నారు నందమూరి బాలకృష్ణ.

బాల‌య్య‌-న‌య‌న‌తార కాంబినేష‌న్‌కు మంచి హిట్ ఫెయిర్ అన్న పేరుంది. ఇక ఈ సినిమాకు సీనియ‌ర్ ఎన్టీఆర్ హిట్ మూవీని టైటిల్‌గా ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. బాలయ్య 102గా వ‌స్తోన్న ఈ సినిమాకు ”కర్ణ” అనే పవర్ ఫుల్ టైటిల్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

గ‌తంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఇదే టైటిల్‌తో చారిత్ర‌క సినిమా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌రి తండ్రికి క‌లిసొచ్చిన ఈ టైటిల్ బాల‌య్య‌కు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో ? చూడాలి.ఇప్పటికే భారీ అంచనాల్ని మూటగట్టుకున్న దీనికి మరింత క్రేజ్ దక్కింది. చూడబోతే.. ఈ చిత్రం గత రికార్డుల్ని తుడిచిపెట్టేస్తూ ప్రభంజనం సృష్టించేలా కనిపిస్తోంది.

Leave a comment