Gossipsబాలయ్య - ఎన్టీఆర్ బయోపిక్ కి డైరెక్టర్ ఫిక్స్

బాలయ్య – ఎన్టీఆర్ బయోపిక్ కి డైరెక్టర్ ఫిక్స్

ఓ వైపు రాము.. మ‌రోవైపు తేజ ఇద్ద‌రూ ఇద్ద‌రే .. ఒక‌రు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నారు. మ‌రొక‌రు బాల‌య్య నిర్మాణ సార‌థ్యంలో సినిమాని రూపొందిస్తున్నారు. బాల‌య్య ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్న ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వం చేసేందుకు  తాజాగా ప్రముఖ దర్శకుడు తేజ అంగీక‌రించార‌ని తెలుస్తోంది. ఇటీవల ‘నేనే రాజు నేనే మంత్రి’తో విజయాన్ని సొంతం చేసుకొన్న తేజ, త్వరలోనే ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొదలుకాబోతోందని ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.

ఈ చిత్రంతో బాలకృష్ణ నిర్మాతగా కూడా మారనున్నట్టు సమాచారం. త్వరలోనే ఓ సంస్థని ఏర్పాటు చేసి అందులో ఎన్టీఆర్‌ బయోపిక్‌తో పాటు, తన తనయుడు మోక్షజ్ఞ చిత్రాన్ని కూడా నిర్మిస్తారని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమా కోసం తమ బంధువుల ను, తన తండ్రి సహచరుల్ని, ఆయన వద్ద పని చేసిన అధికారుల్ని కలిసి వివరాలు సేకరిస్తున్నట్టు బాలకృష్ణ గ‌తంలో వెల్లడించారు.

ఈ సినిమా విషయమై ఇటీవలే తాను చెన్నైకు వెళ్లి వచ్చానని, తన తండ్రి సినీ రంగానికి రాకముందు విషయాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయని చెప్పారు.తాను తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగించేందుకు కృషి చేస్తాన‌ని, ప్రతి రోజూ ఉదయం 3.30 గంటలకు నిద్ర లేస్తానని, ప్రతిక్షణం క్రమశిక్షణతో వ్యవహరించడం మర్చిపోను అని, తన తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా వచ్చింది, తాను నిలబెట్టుకుందీ ఇదేనని తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news