ఓవర్సీస్ స్పైడర్ 1st డే కలెక్షన్స్

spyder collections

ప్రిన్స్ మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్పైడర్ సినిమా భారీ  అంచనాల మధ్య బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే భారీ అంచనాల నేపథ్యంలో స్పైడర్ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇక టాక్‌, రివ్యూలతో ఏమాత్రం  సంబంధం లేకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో  కుమ్మేస్తోంది అనే చెప్పాలి .

ఈ క్రమంలోనే స్పైడర్ ఓవర్సీస్‌లో అదిరిపోయే రేంజ్‌లో వసూళ్లను రాబడుతుంది . తెలుగు, తమిళ భాషల్లో కలిపి సుమారు  800 స్క్రీన్లలో స్పైడర్ సినిమా విడుదల అయింది. ఓవర్సీస్‌లో బాహుబలి తర్వాత ఈ స్థాయిలో థియేటర్లలో విడుదలయిన సినిమా ఇదే కావడం గమనార్హం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం స్పైడర్ కేవలం ప్రీమియర్ల ద్వారానే 9 లక్షల డాలర్లను వసూలు చేసింది.

ఈ క్రమంలోనే మహేష్ ఓ అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రీమియర్ల ద్వారా ఓవర్సీస్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాల పరంగా చూస్తే స్పైడర్ నాలుగో సినిమాగా రికార్డులకు ఎక్కింది. ప్రీమియర్ల ద్వారా 5 లక్షల 59 వేల డాలర్లను కలెక్ట్ చేసి 6వ స్థానంలో ఉన్న జై లవకుశ రికార్డును స్పైడర్ బ్రేక్ చేసింది. అలాగే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డును కూడా బ్రేక్ చేసింది.

అక్కడ ప్రీమియర్ల ద్వారా ఎక్కువ వసూళ్లు కొల్లగొట్టిన తెలుగు సినిమాలను చూస్తే తొలి రెండు స్థానాల్లో బాహుబలి, 1,2 ఉంటే మూడో స్థానంలో చిరు ఖైదీ నెంబర్ 150 ఉంది. నాలుగో ప్లేస్‌లో స్పైడర్ ఉంటే ఐదు సర్దార్ గబ్బర్‌సింగ్‌, ఆరు జై లవకుశ సినిమాలు ఉన్నాయి. ఇక స్పైడర్ వరల్డ్‌వైడ్ ఫస్ట్ డే పూర్తి వసూళ్లు వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

Leave a comment