ఎన్టీఆర్ ఖాతాలో అరుదయినా రికార్డు

about ntr records

జై లవకుశ గత వారం రిలీజ్ అయ్యి సూపర్ సక్సె సాధించిన విషయం తెలిసిందే . ఈ చిత్రం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందనే చెప్పాలి . ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి , ఈ చిత్రం 60 కోట్ల షేర్ కలెక్ట్  చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం .

మొదటి నాలుగు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.40కోట్ల షేర్‌ను రాబట్టిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.60కోట్ల షేర్ విలువను దాటేసింది. నాలుగు రోజుల్లోనే ఇంత కలెక్షన్లను సాధించిందంటే త్వరలో రూ.100కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరుకోవడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ చిత్రానికి జై పాత్ర చాలా ప్లస్ అయింది. విడుదలకు ముందు నుంచే ఈ పాత్రపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండా జై క్యారెక్టరైజేషన్ ఉండటంతో ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ సాయంత్రం జై లవకుశ సక్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ జరుపుకోనుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  ఏ హీరోకి దక్కని అరుదైన ఘనత యంగ్ టైగర్ కి దక్కింది , వరసగా నాలుగు చిత్రాల 50  కోట్ల షేర్ కలెక్ట్ చేసాయి , ఈ రికార్డు మారే హీరోకి లేకపోవడం విశేషం.

Leave a comment