శోభన్ బాబు, జయలలిత పెళ్ళి ఎందుకు జరగలేదు..?

Jayalalitha&Sobhan-Babu Relation Ships

ఈ మధ్య దివంగత తమిళనాడు సీఎం జయలలిత శోభన్ బాబు లవ్ ఎఫైర్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. వాస్తవానికి వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడించింది అనేది పబ్లిక్ స్రీకెట్. అయితే అదికాస్తా మరుగున పడిపోయింది. రీసెంట్ గా కన్నడ రాష్ట్రానికి చెందిన అమృత అనే మహిళ తాను జయలలిత, శోభన్ బాబుల ప్రేమకు తీపిగుర్తును అంటూ చెప్పుకొచ్చింది. అమృత.. శోభన్ బాబు, జయల కుమార్తె  అవునా.. కాదా.. అన్నది పక్కడ బెడితే.. వీరి ఎఫైర్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

ఈ విషయంలో అప్పటి ప్రముఖ రచయిత ఆరుద్ర భార్య రామలక్ష్మీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమెకు శోభన్ బాబుతో మంచి పరిచయం ఉండేదట. దీంతో ఆమె వీరి ఎఫైర్ గురించి మాట్లాడారు. ఒకసారి ఆమె శోభన్ బాబు ఇంటికి వెళ్లారట. ఆయన భార్యను చూసి తగిన జోడి కాదని అనిపించిందట. ఇక ‘గోరింటాకు’ సినిమా షూటింగ్ సందర్భంగా జయలలిత-శోభన్ బాబు ల మధ్య ప్రేమను చూశానని తెలిపారు. ఓ  రోజు సినిమా షూటింగ్ క్యాన్సిల్ కావడంతో శోభన్ బాబుని జయలలిత తన ఇంటిలోనే ఉంచేశారని తెలిపారు. అప్పట్లో శోభన్ బాబు జయను పెళ్లి చేసుకుంటారని అంతా చెప్పుకున్నారని తెలిపారు. కాని తన భార్యను మోసం చేయడం ఇష్టం లేక శోభన్ బాబు వెనక్కు తగ్గారని రామలక్ష్మి తెలిపారు.

Leave a comment