బిగ్ బాస్ పై దీక్ష.. జరిగేది వేరు చూపించేది వేరు..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. లాస్ట్ వీక్ లాస్ట్ ఎలిమినేషన్ లో దీక్ష బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చే ముందే హౌజ్ మెట్స్ మీద తన మనసులోని మాటలతో దూషించిన దీక్ష ఇప్పుడు తాజా ఇంటర్వ్యూస్ లో బిగ్ బాస్ మీద కూడా విరుచుకు పడుతుంది.

కేవలం బిగ్ బాస్ లో తను తినేది.. పడుకునేవే చూపించారు తప్ప మిగతావేవి చూపించలేదని అన్నది. ఇక ధన్ రాజ్ ఉన్న సమయంలో తనతో చాలా ఇబ్బందిగా అనిపించిందని.. తనతో కలిసి బంతిపూల జానకి సినిమా చేశానని.. ఆ సమయంలో షూటింగ్ అయ్యాక సాయంత్రం కలవమని చెప్పేవాడని అన్నది. ఇక హౌజ్ మెట్స్ కావాలని తనని నామినేట్ చేశారని అన్నది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన దీక్షా బయటకు వచ్చాక ఇన్ని మాట్లాడుతుంది కాని అమ్మడు హౌజ్ మెట్స్ తో మాత్రం అంతగా ఇంటరాక్ట్ అయినట్టు ఏమి కనిపించలేదు.

ఇక హౌజ్ లో తనకు అర్చన స్వార్ధపరురాలిగా కనిపించింది అంటూ చెప్పిన దీక్షా కామెంట్స్ కు అర్చన హౌజ్ లో డిస్కషన్స్ పెట్టడం కూడా తనకు నచ్చలేదని అంటుంది. మొత్తానికి ఎలిమినేట్ అయిన దీక్షా బిగ్ బాస్ పట్ల ఏమాత్రం సంతోషంగా లేదని తెలుస్తుంది.

 

Leave a comment