Newsఅమీర్ ఖాన్ ని మించిన ప్రభాస్.. మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో...

అమీర్ ఖాన్ ని మించిన ప్రభాస్.. మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో 5 వ స్థానం

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ ఇప్పుడు సౌత్ కే ప‌రిమితం కాక నేష‌న‌ల్ వైడ్ గా పాకింది. బాహుబ‌లి సినిమాలో ప్ర‌భాస్ న‌ట విశ్వ‌రూపం ఇప్పుడు ఈ హీరోని నేష‌న‌ల్ స్టార్ గా మార్చింది. ప్ర‌భాస్ కోసం బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా క్యూ క‌డుతున్నారు. అయితే రీసెంట్ గా ఇండియా టుడే ఓ స‌ర్వే నిర్వ‌హించింది. 2016-2017 సంవ‌త్స‌రానికి గాను మోస్ట్ పాపుల‌ర్ హీరోలుగా ప‌లువురిని ఎంపిక చేసింది. అందులో ప్ర‌భాస్ టాప్ టెన్ లో చోటు ద‌క్కించుకోవ‌డం విశేషం.

అమితాబ్ బ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్ష‌య్ కుమార్ త‌ర్వాత ఐద‌వ స్థానంలో ప్ర‌భాస్ ఉన్నాడు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌య‌మేమంటే మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ క‌న్నా టాప్ లో ప్ర‌భాస్ ఉన్నాడు. ప్ర‌స్తుతం సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో అనే చిత్రం చేస్తున్న ప్ర‌భాస్ రీసెంట్ గా టీంతో క‌లిసాడు. ఈయ‌న‌పై యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news