Moviesనేతాజి గా రానా.. ఈ దగ్గుబాటి హీరోను ఎవరు ఆపలేరు..!

నేతాజి గా రానా.. ఈ దగ్గుబాటి హీరోను ఎవరు ఆపలేరు..!

టాలీవుడ్ లో ఎలాంటి పాత్రకైనా సూట్ అయ్యే హీరోలు చాలా తక్కువ మందే ఉంటారు. అంతేకాదు ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి ప్రయోగాలకు దూరంగా ఉంటారు. కాని సరైన కథ కథనాలు రావాలే కాని ఎలాంటి పాత్రకైనా తాను సిద్ధమే అని ఎప్పుడు అంటుంటాడు రానా. అందుకే బాహుబలి లాంటి సినిమాలో విలన్ గా నటించాడు ఈ దగ్గుబాటి హీరో. రానా కాకుండా బాహుబలిలో ఇంకా వేరే ఎవరినైనా పెట్టినా కచ్చితంగా అదో వెళ్తిగా ఉండేదేమో. ప్రస్తుతం నేనే రాజు నేనే మంత్రి సినిమా రిలీజ్ కు రెడీ అవ్వగా మరోసారి ఓ ప్రయోగాత్మక సినిమా చేయబోతున్నాడు రానా.

నేతాజి సుభాష్ చంద్రబోస్ సైన్యంలో ఓ సిపాయి కథతో ఓ పేట్రియాటిక్ మూవీ చేసేందుకు సిద్ధమయ్యాడట. కథ అంతా సుభాష్ చంద్రబోస్ కాలంలో జరుగుతుందని తెలుస్తుంది. ప్రేమకథతో కూడిన ఈ కథ ప్రస్తుతం చర్చల దశల్లో ఉందని తెలుస్తుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి వివరాలు వెళ్లడవుతాయి. ఈమధ్యనే ఘాజి అంటూ ఇండియా పాక్ మధ్య జరిగిన సబ్ మెరైన్ యుద్ధంతో హిట్ అందుకున్న రానా ఈసారి మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు గురి పెట్టాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది దీనికి దర్శక నిర్మాతలు ఎవరు అన్నది త్వరలో తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news