నేనే రాజు నేనే మంత్రి జోగేంద్ర సత్తా ఎంత అంటే..!

ఈ శుక్రవారం రిలీజ్ అయిన మూడు సినిమాల్లో ఎక్కువ ప్రమోషన్స్ చేసి ప్రేక్షకులకు బాగా ఇంటరాక్ట్ అయిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. రిలీజ్ మొదటి షో కాస్త మిక్సెడ్ టాక్ వచ్చినా ఫైనల్ గా రేసులో రానా గెలిచాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు పోటీగా వచ్చిన లై, జయ జానకి నాయకా సినిమాలలో లై డల్ గా నడుస్తుండగా బోయపాటి జయ జానకి నాయకా సినిమాకు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది.

తేజ డైరక్షన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రిలో జోగేంద్ర పాత్రలో రానా తప్ప ఇంకీ ఎవరిని ఊహించుకోలేం. తన పాత్రకు తాను చేసిన న్యాయం అంతా ఇంతా కాదు. కథలను నమ్మే హీరోగా రానా మరోసారి ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడంలో తన పనితనం చాటుకున్నాడు. కాజల్ కూడా రాదగా ఎంతో గొప్ప అభినయాన్ని కనబరచింది. ఇక ఈ సినిమా మూడు రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే..

నైజాం 3.40 కోట్లు,
సీడెడ్ 1.32 కోట్లు,
వైజాగ్ 1.56 కోట్లు,
గుంటూర్ 63 లక్షలు,
కృష్ణ 58 లక్షలు,
ఈస్ట్ 69 లక్షలు,
వెస్ట్ 39 లక్షలు,
నెల్లూరు 27 లక్షలు.
మొత్తంగా ఏపి, తెలంగాణా రాష్టాల్లో 8.84 కోట్ల వసూళ్లను రాబట్టింది నేనే రాజు నేనే మంత్రి.
ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ సినిమా దగ్గర దగ్గర 15 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలుస్తుంది.

Leave a comment