కొత్త డైరెక్టర్ తో నాగార్జున రిస్క్ ?

nagarjuna taking risk with new director
‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మించి చైతూకి హిట్ ఇచ్చిన నాగార్జున, తాను ప్రధాన పాత్రగా ‘రాజుగారి గది 2’ ను పూర్తి చేసి అఖిల్ సినిమాపై దృష్టి పెట్టాడు. నాగ్ నిర్మాతగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే .. తాను హీరోగా ఒక సినిమా చేయడానికి నాగార్జున రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.
ముందుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయాలనుకున్నప్పటికీ, ఆ ఆలోచనను వాయిదా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువ దర్శకుడు వినిపించిన కథ .. ఆయనకి బాగా నచ్చేసిందట. దాంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి .. చకచకా ఏర్పాట్లు చేసుకోమని చెప్పినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారట .

Leave a comment