వెల్ డన్ ఎన్టీఆర్ … థాంక్యూ బాబాయ్.. ట్వీట్లతో ఒకరికొకరు అభినందనలు.. మురిసిన అభిమానులు

nagarjuna-praises-ntr

స్టార్ మా టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ను ఎన్టీఆర్ నడిపిస్తున్న తీరును చూసిన హీరో నాగార్జున ముగ్ధుడైపోయి, అభినందనలు తెలుపగా, అందుకు కృతజ్ఞతలు చెప్పాడు ఎన్టీఆర్. “బిగ్ బాస్ తొలి వారం అద్భుత రీతిలో సాగింది. కంగ్రాచ్యులేషన్స్ టూ తారక్. నీలో ఎనర్జీ ఎంతో గొప్పగా ఉంది” అని నాగార్జున నిన్న రాత్రి 11.54 గంటల సమయంలో ట్వీట్ చేశాడు.

దాన్ని చూడటం కాస్తంత ఆలస్యమైందో ఏమో, కొద్దిసేపటి క్రితం తారక్ సమాధానమిస్తూ, “ధ్యాంక్స్ ఏ లాట్ బాబాయ్… నువ్వు నడిచిన అడుగులే మా అందరికీ ఆదర్శం” అంటూ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమాన్ని నాగార్జున విజయవంతం చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. ఇక వీరి ట్వీట్ల సంభాషణను చూసిన కోనేరు మహేష్, “చిన్న స్క్రీన్ ను మరింత పెద్దదిగా మార్చిన లెజండ్స్” అని స్పందించాడు.

Leave a comment