ముమైత్ బిగ్ బాస్ రీ ఎంట్రీ.. ఓ సినిమా చూపించేశారు..!

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చి విచారణలో పాల్గొంది. అయితే బిగ్ బాస్ నుండి సడెన్ గా బయటకు వచ్చిన ముమైత్ అక్కడ పెద్ద సీన్ చేసింది. అందరితో కలివిడిగా ఉండే ముమైత్ సడెన్ గా హౌజ్ నుండి బయటకు వెళ్లిపోవడం హౌజ్ మెట్స్ అందరికి షాక్ తగిలినట్టైంది. ఆమె మళ్లీ వచ్చేది రానిది క్లారిటీ లేని నేపథ్యంలో ఆమె వెళ్తుండగా ఓ సీరియల్ ఎపిసోడ్ లా కన్నీటి పర్యంతమయ్యారు అందరు హౌజ్ మెట్స్.

ఇక నిన్న ఎపిసోడ్ లో మళ్లీ ముమైత్ రీ ఎంట్రీ ఇచ్చింది. అర్ధరాత్రి 2:30 కు అలా బిగ్ బాస్ హౌజ్ లోకి ముమైత్ రీ ఎంట్రీ ఇచ్చింది. ముమైత్ మళ్లీ రావడం హౌజ్ మెట్స్ లో మంచి జోష్ ఇచ్చింది. అర్ధాంతరంగా బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వెళ్లిన ముమైత్ మళ్లీ రావడం కంటెస్టంట్స్ అందరిలో ఓ కొత్త హుశారొచ్చిందంటే నమ్మాలి.

ఇక వారం ముగిసింది.. ఎలిమినేషన్ ప్రక్రియకు వచ్చేశారు. ఈ వారం హౌజ్ నుండి ఎవరు బయటకు వెళ్తారో ఈరోజు తారక్ వెళ్లడించేస్తారు. ఈరోజు వచ్చే ఎన్.టి.ఆర్ ఎపిసోడ్ కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈరోజు రేపు (ఆదివారం) తారక్ చేసే సందడి ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment