Newsశిరీష కేసులో కొత్త మలుపు .. శిరీష సోదరి చెబుతున్న షాకింగ్...

శిరీష కేసులో కొత్త మలుపు .. శిరీష సోదరి చెబుతున్న షాకింగ్ విషయాలు ..

హైదరాబద్ లో బ్యూటీ షియన్ శిరీష ఆత్మహత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఆమె ది ఆత్మహత్య అని పోలీసులు ఓకే చేసిన తరవాత ఇప్పుడు ఆమె సోదరి భార్గవి రంగంలోకి దిగారు. తన సోదరి అంత పిరికితనం గా ఆత్మహత్య చేసుకునే మనిషి కాదు అనీ ఆమె అంత చేతకాని తనంగా ఎప్పుడూ లేదు అన్నారు ఆమె. మధ్యాహ్నం 2 గంటలకు శిరీష ఘటనపై పోలీసులు మాట్లాడనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె స్పదించారు. ఈ కేసులో తమకు పలు అనుమానాలున్నాయని చెప్పారు.

ఈ కేసులో నిందితురాలు తేజస్వినిని ఎందుకు దాస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తన చెల్లెలిది ముమ్మాటికీ హత్యేనని ఆమె స్పష్టం చేశారు. ఈ హత్య వెనుక రాజీవ్, శ్రావణ్, తేజస్వి ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసులు కావాలనే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె అన్నారు.

రెండు సార్లు తన చెల్లెలిపై దాడి చేసిన వాడు హత్య చేసి ఉంటాడని ఎందుకు భావించకూడదని ఆమె ప్రశ్నించారు. తన చెల్లెలికి ఎలాంటి సమస్యలు లేవని, కుటుంబం మొత్తం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. అలాంటిది అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏంటని ఆమె ప్రశ్నించారు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news