ఒకటి కాదు రెండు కాదు ముప్పై తిరుగులేని రికార్డులు సాధించిన బాహుబలి

baahubali 2 movie records

‘బాహుబలి: ద కన్ క్లూజన్’ రికార్డుల పంట పండించింది. అనితర సాధ్యమైన రీతిలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 30 రికార్డులు సాధించి సత్తాచాటింది. టీజర్, ట్రైలర్, పోస్టర్ లన్నీ సోషల్ మీడియాలో రికార్డుల దుమ్ముుదులపగా, ఏప్రిల్ 28న విడుదలకు ముందు రోజు రాత్రి నుంచే వసూళ్ల పర్వం కొనసాగించింది. ఆడియో, శాటిలైట్ హక్కులు ఇలా వివిధ రూపాల్లో రికార్డు స్ధాయి వసూళ్లు సాధించింది.

అనంతరం ఆన్ లైన్ ప్రీ బుకింగ్, కరెంట్ బుకింగ్ లలో రికార్డు నెలకొల్పింది. ఫస్ట్ షోకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా, అత్యధిక ఆక్యుపెన్సీ సాధించిన సినిమా, తొలి రోజు వంద కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా, మూడురోజుల్లో 300 కోట్లు, తొలి వారంలో 500 కోట్లు, రెండు వారాలు ముగిసే సరికి 1000 కోట్లు, రెండో వారాంతానికి భారత్ లో అత్యదిక కలెక్షన్లు సాధించిన సినిమా, అమెరికాలో వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమా, 1200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమా… కేవలం హిందీ వెర్షన్‌తో, అది కూడా డబ్డ్‌ వెర్షన్‌తో హిందీ చిత్ర చరిత్రలో ఇండియాలో తొలిసారిగా నాలుగు వందల కోట్ల వసూళ్లు సాధించిన రికార్డ్‌… ఇలా అనితరసాధ్యమైన చలనచిత్ర రికార్డులన్నీ ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ సొంతం చేసుకుంది. ఇలా 30 చలనచిత్ర రికార్డులు నెలకొల్పింది.

Leave a comment