Newsఎన్టీఆర్ కోసం బరువు తగ్గిన బబ్లీ బ్యూటీ.. చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు...

ఎన్టీఆర్ కోసం బరువు తగ్గిన బబ్లీ బ్యూటీ.. చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు (ఫోటోలు)

టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నాకు మొదటి సినిమా నుంచి ఫాలోయింగ్ విపరీతంగా వచ్చింది. అందులో చాలావరకూ అవకాశాలుగా కూడా మారాయి. కుర్ర హీరోలకు ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. ఖాతాలో హిట్స్ కూడా బాగానే పడ్డాయి. కానీ స్టార్ హీరోయిన్ అనిపించుకునేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది రాశి.

ఇందుకు కారణం అమ్మడి పర్సనాలిటీ అంటారు ఇండస్ట్రీ జనాలు. కాసింత భారీ దేహం కావడంతో.. స్టార్స్ ఈమెను ఇన్నాళ్లు దగ్గరకు రానీయలేదు. కానీ ఓ ఏడాదిగా మాత్రం బాడీపై, ఫిట్నెస్ పై బాగానే దృష్టి పెట్టింది. తగ్గిందనే సంగతి తెలుసు కానీ.. ఏ స్థాయిలో తగ్గిందనే విషయంలో మాత్రం.. తాజాగా జరిగిన ఐఫా ఉత్సవంలో అందరికీ అర్ధమైంది. ఇక్కడ డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసిన ఈ బ్యూటీ.. అంతకు ముందుకు మేకప్ రూమ్ లో దిగిన ఫోటో ఇది. కాస్ట్యూమ్స్.. ఆర్నమెంట్స్ ఎంత గ్రాండ్ గా ఉన్నాయో.. అంతకు మించి గ్రాండ్ గా ఉంది రాశి ఖన్నా అందం.

RashiKhanna

RashiKhanna1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news