News'గురు' హీరోయిన్ అంతకు ముందు ఏమి చేసేదో తెలుసా? 

‘గురు’ హీరోయిన్ అంతకు ముందు ఏమి చేసేదో తెలుసా? 

స్వయంగా బాక్సింగ్ నేపథ్యం ఉండటం వల్లే రితికా గురు లో పాత్రను అంత బాగా చేసింది. ముంబయికి చెందిన రితికకు చిన్నప్పట్నుంచి మార్షల్ ఆర్ట్స్ అనుభవం ఉంది. కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకుంది. 2009 ఆసియా ఇండోర్ గేమ్స్ లో ఆమె పోటీ పడింది కూడా. ఆ తర్వాత శిల్పా శెట్టి భర్త మొదలుపెట్టిన సూపర్ ఫైట్ లీగ్ లోనూ తలపడిందామె. మహిళల బాక్సింగ్ నేపథ్యంలో సుధ కొంగర ‘ఇరుదు సుట్రు’ సినిమా తీయాలనుకున్నాక..  లీడ్ రోల్ కోసం చాలామంది అమ్మాయిల్ని పరిశీలించింది. ఆ క్రమంలోనే రాజ్ కుంద్రా ద్వారా.. రితిక గురించి తెలిసి ఆమెను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకుంది. అలా బాక్సింగ్ నుంచి అనుకోకుండా సినిమాల వైపు వచ్చింది రితిక. నటనలో ఏమాత్రం అనుభవం లేకపోయినా సరే.. సుధ దగ్గర చాన్నాళ్ల పాటు ట్రైనింగ్ తీసుకుని రాటుదేలింది. ‘ఇరుదు సుట్రు’లో అద్భుతంగా నటించి మెప్పించింది. ఇప్పుడు ‘గురు’తో తెలుగు ప్రేక్షకులనూ కట్టిపడేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news