Newsహ్యాట్సాఫ్ తారక్ ... అందరి నోట అదే మాట!!

హ్యాట్సాఫ్ తారక్ … అందరి నోట అదే మాట!!

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కెరీర్ టాప్ ఫాంలో ఉన్నాడు. వరుస విజయాలు తనను ఏ మాత్రం మార్చలేవని.. ఎంత ఎదిగినా ఇంకా ఒదిగే ఉంటానని తన మాటలతోనే నిరూపించేశాడు యంగ్ టైగర్. తాజాగా జరిగిన ఐఫా ఉత్సవంలో ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు.

అయితే.. దీని కంటే పెద్ద విషయం ఏంటంటే.. అక్కడ ఆన్ స్టేజ్ పై ఎన్టీఆర్ చెప్పిన మాటలే. తన సినిమాకు అవార్డ్ వస్తే.. ఆ సినిమా గురించి యూనిట్ గురించి చెప్పుకోవడం కామన్. కానీ ఎన్టీఆర్ మాత్రం.. బెస్ట్ యాక్టర్ అవార్డు నామినీల అందరూ పేర్లను చదివి వినిపించాడు. అంతే కాదు.. అందరూ అద్భుతమైన నటన ప్రదర్శించారంటూ ప్రశంసలు గుప్పించాడు. తను అందుకున్న ఈ అవార్డు తన ఒక్కడికి మాత్రమే కాదని.. అందరికీ దక్కిన గుర్తింపు అని ఎన్టీఆర్ చెప్పడంతో.. అందరూ అతని ప్రవర్తనకు మాటలకు ముగ్ధులైపోయారు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news