Moviesతొలిరోజు బాక్సాఫీస్ వద్ద రఫ్పాడించేసిన ‘లోకల్’ నాని

తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రఫ్పాడించేసిన ‘లోకల్’ నాని

Natural star Nani’s latest movie has done very well at the worldwide boxoffice in it’s first day run. According to trade, this is the highest grosser for nani.

నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రఫ్పాడించేసింది. ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లే రాబట్టింది. వరుసగా ఐదు విజయాలు సాధించిన తర్వాత నాని చేసిన ఆరోచిత్రం కావడంతో.. దీనిపై మొదటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని అందుకోవడంలో ఇది సక్సెస్ కావడంతో.. ఫస్ట్ డే ప్రభంజనం సృష్టించింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ‘నేను లోకల్’ చిత్రం మొదటి రోజు రూ.5.5 కోట్లుపైనే కలెక్ట్ చేసింది. అందులో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ. 4 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. నాని గత చిత్రాలతో పోల్చుకుంటే.. ఇదే హయ్యెస్ట్ ఫిగర్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓవైపు సంక్రాంతి సినిమాలు ఇప్పటికీ సత్తా చాటుతున్నప్పటికీ.. వాటికి ధీటుగా నాని సినిమా ఈ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అన్నిచోట్ల పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి.. ఈ వీకెండ్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడుకుంటుందని భావిస్తున్నారు.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నాని కాలేజ్ స్టూడెంట్‌గా ఓ మాస్ క్యారెక్టర్‌లో కనిపించగా.. అతని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news