Movies గంటలో తిరుగులేని రికార్డ్ నమోదు చేసిన ‘కాటమరాయుడు’ టీజర్

గంటలో తిరుగులేని రికార్డ్ నమోదు చేసిన ‘కాటమరాయుడు’ టీజర్

Pawan Kalyan’s latest movie katamarayudu teaser has created a sensational record on youtube with huge views and likes.

స్టార్ హీరోల సినిమాలు సెట్స్ మీదకి వెళుతున్నాయంటే చాలు.. అప్పటినుంచే అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంటాయి. ఇక ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్ రిలీజవుతున్న సందర్భాల్లో అయితే సామాజిక మాధ్యమాల్లో వాటి హల్‌చల్ అంతా ఇంతా ఉండదు. ఫ్యాన్స్‌తోపాటు సినీజనాలు సైతం వాటి కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటారు కాబట్టి.. అవి రిలీజయ్యాక అందరూ ఒకేసారి ఎగబడతారు. దాంతో.. సరికొత్త రికార్డులు నమోదు అవుతుంటాయి. తాజాగా ‘కాటమరాయుడు’ టీజర్ అయితే ఇప్పటివరకు ఏ సినిమా సాధించని తిరుగులేని ఘనత సొంతం చేసుకుంది. రిలీజైన గంటలోనే ఊహించని వ్యూస్, లైక్స్ రాబట్టుకుంది.

ఈ మూవీ యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కేవలం గంటలోనే ఈ మూవీ టీజర్ ఏకంగా 5.2 లక్షల వ్యూస్ రాబట్టింది. అలాగే.. 50 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఓ తెలుగు మూవీ టీజర్‌కి కేవలం గంటలోనే అన్ని వ్యూస్, లైక్స్ రావడం ఇదే తొలిసారి. ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి విపరీతమైన అంచనాలు నెలకొనడం, దానికితోడు పవన్ కళ్యాణ్ క్రేజ్ కలిసి రావడం వల్లే ఈ టీజర్‌ రికార్డ్ స్థాయిలో వ్యూస్, లైక్స్‌తో దూసుకెళుతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. దీని దూకుడు చూస్తుంటే.. త్వరలోనే 1 లక్ష లైక్స్ సాధిస్తుందని అంటున్నారు. అదే గనుక నిజమైతే.. తొలిసారి ఆ ఘనత సాధించిన మొదటి టీజర్‌గా ఇది నిలిచిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news