Movies‘ఘాజీ’ సెన్సార్ రివ్యూ.. ప్రశంసలతో ముంచెత్తిన బోర్డ్ సభ్యులు

‘ఘాజీ’ సెన్సార్ రివ్యూ.. ప్రశంసలతో ముంచెత్తిన బోర్డ్ సభ్యులు

Rana Daggubati’s latest film Ghazi has completed it’s censor formalities and gets U certificate without any cuts.

దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఘాజీ’ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 1971లో ఇండియా – పాకిస్థాన్ మధ్య జరిగిన సబ్‌మెరైన్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కోతలు వేయకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేశారు. అంతేకాదు.. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించినందుకు యూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తారని సమాచారం. ముఖ్యంగా.. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారని తెలిపింది.

1971లో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన వార్‌లో విశాఖపట్నం సమీపంలోని సముద్రంలో ‘పీఎన్ఎస్-ఘాజీ’ ఎలా విచ్ఛిన్నం అయిందో ఇప్పటికీ మిష్టరీనే. ఆ రహస్యం నేపథ్యంలో ఘాజీ అనే యుద్ధనౌక సెట్టింగ్‌ను వేసి.. అత్యంత విలువైన సాంకేతిక అంశాలను జోడించి.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు సంకల్ప్. అతనే కథ, స్క్రీన్ ప్లే రాసుకుని దర్శకత్వం వహించాడు. రానా, తాప్సీ, నాజర్‌లతోపాటు బాలీవుడ్ ప్రముఖ నటులు కె.కె.మీనన్, అతుల్ కులకర్ణీ, ఓంపూరి, తదితర భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పి.వి.పి.సినిమా, మాట్నీ ఎంటర్టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని యూనిట్ నమ్మకంగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news