Bhaktiదేవుని హారతి కళ్ళకు అద్దుకోవచ్చా?

దేవుని హారతి కళ్ళకు అద్దుకోవచ్చా?

గుడిలో దేవుని హారతిని కళ్ళకద్దుకోకూడదు.కేవలం దణ్ణం పెట్టుకోవాలి. ‘హారతి ఇతి హారతి’ దృష్టిదోషాన్ని హరించేది హారతి. అందుకే దాన్ని నీరాజనం అని కూడా అంటారు.దేవుడిపైన దర్శించటానికి వచ్చిన ఎంతో మంది ద్రుష్టి పడుతుంది. ఆ దృష్టిదోషం తొలగటానికి అర్చకులు హారతి ఇచ్చి భక్తులందరికీ చూపెడతారు.అప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ ఆ హారతికి దణ్ణం పెట్టుకోవాలి భక్తిగా.చిన్నపిల్లలకు, శుభకార్యాల్లోనూ హారతితో దిష్టితీసి పెరట్లో ఓ మూలన పడేస్తారు. అలాగే దేవుడికి మంగళం కలగాలని హారతి ఇచ్చి శ్లోకాలు చదివి ఆ హారతిని ఒక పక్కన పెడతారు. కానీ శివ భక్తులు హారతి ని కళ్ళకు అడ్డుకుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news