తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన టాప్-25 తెలుగు సినిమాలు ఇవే!

top 25 telugu movies highest first day collections list

Here is the list of top 25 highest first day Telugu movie collections report in which visual wonder Baahubali stood at first position.

ఒకప్పుడు సినిమాలు ఎన్నిరోజులు ఆడేవి? ఎన్నెన్నె సెంటర్లలో ప్రదర్శింపబడేవి? అనే లెక్కలు వేసుకునేవారు. కానీ.. ఇప్పుడా రోజులు లేవు. ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసిందన్న విషయంపైనే లెక్కలేసుకుంటున్నారు. ట్రేడ్ వర్గాలు దాని ఆధారంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని, తొలిరోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన టాప్-25 సినిమాల జాబితాని విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్ చరణ్‌ల సినిమాలే ఉన్నాయి.

Read this Article in English : Telugu First Day Collections Movies

మరో విశేషం ఏమిటంటే.. ఈ లిస్ట్‌లో హిట్ అయిన సినిమాలతోపాటు ఫ్లాప్ అయిన మూవీలు కూడా స్థానం దక్కించుకున్నాయి. భారీ అంచనాల మధ్య అ చిత్రాలు విడుదల అవ్వడంతోపాటు హీరోకి ఉన్న క్రేజ్ కారణంగా.. అవి ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించాయని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి’పై మొదటినుంచే తారాస్థాయిల అంచనాలు నెలకొనడంతో.. అది అత్యధిక వసూళ్లు సాధించి, మొదటి స్థానం సంపాదించింది. ఇంకా ఇతర మూవీలు ఏయే స్థానాల్లో ఉన్నాయో.. క్రింది జాబితాలో తెలపడం జరిగింది.

1. బాహుబలి : 22.4 కోట్లు
2. సర్దార్ గబ్బర్ సింగ్ : 20.92 కోట్లు
3. జనతా గ్యారేజ్ : 20.49 కోట్లు
4. శ్రీమంతుడు : 14.72 కోట్లు
5. బ్రహ్మోత్సవం : 13.06 కోట్లు
6. బ్రూస్ లీ : 12.66 కోట్లు
7. నాన్నకు ప్రేమతో : 12.18 కోట్లు
8. సరైనోడు : 10.96 కోట్లు
9. అత్తారింటికి దారేది : 10.75 కోట్లు
10. ధృవ : 10.35 కోట్లు
11. ఆగడు : 9.74 కోట్లు
12. టెంపర్ : 9.68 కోట్లు
13. సన్నాఫ్ సత్యమూర్తి : 9.27
14. బాద్ షా : 9.25 కోట్లు
15. గోపాల గోపాల : 9.19 కోట్లు
16. రుద్రమదేవి : 9.17 కోట్లు
17. రభస : 8.85 కోట్లు
18. రామయ్య వస్తావయ్యా : 8.7 కోట్లు
19 & 20. కెమెరామన్ గంగతో రాంబాబు & ఎవడు : 8.65 కోట్లు
21 & 22 . నాయక్ & గోవిందుడు అందరివాడేలే : 8.55 కోట్లు
23. 1- నేనొక్కడినే : 8.4 కోట్లు
24. గబ్బర్ సింగ్ : 8.15 కోట్లు
25. దమ్ము : 8.04 కోట్లు

Leave a comment