Gossipsషాక్ : కిడ్నీ సమస్యతో ఆసుపత్రిపాలైన తెలుగు స్టార్ హీరో

షాక్ : కిడ్నీ సమస్యతో ఆసుపత్రిపాలైన తెలుగు స్టార్ హీరో

A Telugu star hero suffering with kidney problem from few days. Present he is taking treatement in Bangalore.

తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనో లేక మరేదైనా కారణమో తెలీదు కానీ.. సెలబ్రిటీలు చాలావరకు తమ వ్యక్తిగత విషయాలను వెల్లడించరు. మరీ ముఖ్యంగా.. వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని చాలా రహస్యంగా ఉంచుతారు. తాజాగా ఓ తెలుగు స్టార్ హీరో కూడా తనకున్న కిడ్నీ సమస్య గురించి బయట పొక్కనివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ వచ్చాడు కానీ.. అది ఎన్నాళ్లో దాగలేదు.

వయసు పైబడినా ఇంకా గ్లామర్ మెయింటెయిన్ చేస్తూ యువకుడిలా కనిపించే ఆ స్టార్ హీరో.. గతకొన్నాళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అయితే.. ఇప్పటికిప్పుడే మంచం పట్టేంత సమస్య కాదని, కానీ దీర్ఘకాలం ట్రీట్‌మెంట్ తీసుకోవాలని డాక్టర్లు ఆయనకి సూచించారు. దీంతో.. ఆయన బెంగుళూరుకి వెళ్లి, అక్కడ చికిత్స చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ మెడిసిన్ వాడుతున్న ఆ హీరో.. స్ట్రిక్ట్ డైట్ కంట్రోల్‌పై ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ అవసరమైతే.. ఆయనకు డయాలసిస్ కూడా చేస్తారని చెప్పుకుంటున్నారు.

ఈ విషయాన్ని ఆ హీరో సీక్రెట్‌గానే ఉంచాలని ప్రయత్నించాడు కానీ.. టీవీ చానల్స్‌లో అనారోగ్య కార్యక్రమాలు చేసే జర్నలిస్టులకు ఈ హీరో ట్రీట్‌మెంట్ చేయించుకునే డాక్టర్ టచ్‌లో ఉండడంతో బయటపడింది. మరి.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. అన్నట్లు.. ఆ హీరో ఇప్పటికీ చలాకీగానే అన్ని కార్యాల్లో పాల్గొంటున్నాడు. ఈపాటికే ఆ హీరో ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news