‘శతమానం భవతి’ 4 రోజుల కలెక్షన్స్.. ఆ మార్క్‌ని దాటేసిన శర్వానంద్

Shatamanam Bhavathi 4 days collections report

Shatamanam Bhavathi 4 days collections of Telugu state report is out. According to trade report, this movie enterned in 10 crores club in just 4 days run.

యంగ్ హీరోల సినిమాలు సోలోగా రిలీజైనా.. వాటికి కలెక్షన్లు అంతంత మాత్రమే వస్తాయి. బ్రేక్ ఈవెన్‌కి చేరడానికే ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఒకవేళ ఏదైనా ఒక స్టార్ హీరో సినిమాకి పోటీగా బరిలోకి దిగితే.. అతికష్టం మీద ఆ చిన్న సినిమా వసూళ్లు రాబడుతుంది. కానీ.. ‘శతమానం భవతి’ మాత్రం ఇప్పుడా హద్దులను చెరిపేసేంది. రెండు భారీ సినిమాల మధ్య బరిలోకి వచ్చినప్పటికీ.. వాటికి గట్టి పోటీ ఇస్తూ ట్రేడ్ వర్గాల్నే ఆశ్చర్యంలోకి ముంచెత్తుతోంది. అన్నిటికంటే మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం 10 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుని ‘శతమానం భవతి’ సినిమా నాలుగు రోజుల్లో రూ. 10.27 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో స్టార్ హీరో లేడు.. దర్శకుడు వేగేశ్నకి ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లేదు.. అయినా ఈ సినిమా ఇంత తక్కువ టైంలో అంతమొత్తం కలెక్ట్ చేయడం నిజంగా విశేషం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ రావడం వల్లే.. రెండు పెద్ద సినిమాల భారీ పోరులోనూ ఇలా వసూళ్లు రాబడుతోందని అంటున్నారు. ఈ సినిమా దూకుడు చూస్తుంటే.. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే టోటల్ రన్‌లో రూ.20 కోట్ల మార్క్‌ని క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు.

ఏరియాల వారీగా 4 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 3.46
వైజాగ్ : 1.77
ఈస్ట్ గోదావరి : 1.28
సీడెడ్ : 1.20
వెస్ట్ గోదావరి : 0.91
గుంటూరు : 0.77
కృష్ణా : 0.63
నెల్లూరు : 0.25
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 10.27 కోట్లు

Leave a comment