Movies‘శతమానం భవతి’ మూడు రోజుల కలెక్షన్స్.. దిగ్గజాలను సైతం వణికించింది!

‘శతమానం భవతి’ మూడు రోజుల కలెక్షన్స్.. దిగ్గజాలను సైతం వణికించింది!

shatamanam bhavathi 3 days collections of Telugu states report is out and it is really shocking. This film has earned amazing amount in it’s first monday which shocks every one.

చిన్న సినిమాలకు వీకెండ్స్‌లోనే కాసుల వర్షం కురుస్తుంది. వర్కింగ్ డేస్‌లో అంతంత మాత్రమే కలెక్షన్లు వస్తాయి. ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. వాటి స్థాయి అంతే. కానీ.. ‘శతమానం భవతి’ మాత్రం అనూహ్య వసూళ్లు రాబడుతోంది. అది కూడా రెండు దిగ్గజాలు ‘నువ్వా-నేనా’ అంటూ పోటీపడుతున్న టైంలో ట్రేడ్ వర్గాలే షాకయ్యేలా కోట్లు కొల్లగొడుతోంది.

తొలిరోజు (శనివారం) రూ.3.05 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. రెండోరోజు (ఆదివారం) రూ.2.70 కోట్లు సాధించింది. ఆ రెండురోజులు వీకెండ్స్ కాబట్టి మంచి వసూళ్లు కలెక్ట్ చేయగలిగిందని.. సోమవారంనుంచి కలెక్షన్లలో డ్రాప్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లోనూ అలాగే చర్చించుకున్నారు. పైగా.. చిరు, బాలయ్య చిత్రాలు పోటాపోటీగా భారీ కలెక్షన్లు సాధిస్తున్నాయి కనుక, వాటి సునామీ ముందు ఇది కొట్టుకుపోవచ్చునని భావించారు. కానీ.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా వర్కింగ్ డే అయిన సోమవారం కూడా దిమ్మతిరిగే కలెక్షన్స్ రాబట్టింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చిత్రం మూడోరోజైన సోమవారంనాడు రూ.2.48 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది నిజంగా షాకింగ్ రిజల్ట్. రెండు ప్రతిష్టాత్మక భారీ పోటీ నేపథ్యంలో అదికూడా వీక్‌డే ఇంతమొత్తం కలెక్ట్ చేయడం విశేషం. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడం వల్లే ఇలా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోందని అంటున్నారు. మొత్తం మూడురోజుల లెక్కలు కలుపుకుంటే.. ఈ చిత్రం ఖాతాలో రూ.8.23 కోట్లు (షేర్) చేరాయి.

ఏరియాల వారీగా 3 రోజుల కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 2.80
సీడెడ్ : 0.99
నెల్లూరు : 0.21
కృష్ణా : 0.49
గుంటూరు : 0.63
వైజాగ్ : 1.34
ఈస్ట్ గోదావరి : 1.04
వెస్ట్ గోదావరి : 0.73
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ. 8.23 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news