మోషన్ పోస్టర్ టాక్ : లేటుగా వచ్చినా.. లేటెస్ట్‌గా ‘టచ్’ చేసిన రవితేజ

raviteja touch chesi choodu movie motion poster review

Mass Maharaja Raviteja latest movie titled as Touch chesi Choodu. Unit has released motion poster on the vacation of Republic day and his birthday. Rashi Khanna playing female lead role.

రీసెంట్‌గానే మాస్ మహారాజా కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందని వార్తలొచ్చాయి. అయితే.. ఇదికూడా గత సినిమాల్లాగే సెట్స్ మీదకి రాకముందే ఆగిపోతుందని అనుకున్నారు. ఒకవేళ ఫిక్స్ అయినా.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అన్న క్లారిటీ కూడా లేదు. కానీ.. అందరికీ షాకిస్తూ ఇంకా ప్రారంభోత్సవం కూడా జరపకుండానే టైటిల్‌తోపాటు మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు యూనిట్ సభ్యులు. రవితేజ బర్త్‌డే, రిపబ్లిక్ డే సందర్భంగా దీన్ని విడుదల చేశారు.

ఈ సినిమాకి ‘టచ్ చేసి చూడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీన్ని బట్టి.. ఈ చిత్రం రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టుగా పూర్తి మాస్ మసాలా ఎంటర్టైన్‌మెంట్‌గా తెరకెక్కుతోందని అర్థం చేసుకోవచ్చు. ఇక మోషన్ పోస్టర్‌ విషయానికొస్తే.. ఇందులో రవితేజ గెటప్ సింప్లీ సూపర్బ్‌గా ఉంది. ఇయర్‌ఫోన్ పెట్టుకుని మాస్ గెటప్‌లో స్టైలిష్‌గా కనువిందు చేశాడు. దీనికి ప్రీతమ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. దీంతోపాటు విడుదల చేసిన మరో పోస్టర్‌లోనూ రవితేజ కేక అనిపించాడు. చిలిపిగా డ్యాన్స్ చేస్తూ తన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా కిక్ ఇచ్చాడు మన మాస్ మహారాజ.

నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా లక్ష్మీ నరసింహ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ సిరి తెరకెక్కిస్తున్నాడు.

Leave a comment