Gossipsమాస్టర్ ప్లాన్‌తో ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిన రవితేజ

మాస్టర్ ప్లాన్‌తో ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చిన రవితేజ

Mass Maharaja Raviteja planning two movies in 2017 to entertain his fans again. According to sources, his first film with Anil Ravipudi will go on floors very soon.

మాస్ మహారాజా రవితేజ ప్రతిఏడాది రెండు, మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించేవాడు. కానీ.. 2016లో అతను ఒక్కటంటే ఒక్క సినిమా కూడా చేయలేదు. నిజానికి.. 2015లో ‘బెంగాల్ టైగర్’సినిమా ఇంకా రిలీజ్ కాకముందే నాలుగైదు ప్రాజెక్టులను రవితేజ లైన్‌లో పెట్టాడు. అందులో దిల్‌రాజుతో చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఇంతలో ఏమైందోఏమో తెలీదు కానీ.. ఈ సినిమా అటకెక్కింది. అనంతరం మిగతా మూవీలు కూడా స్టార్ట్ కాకముందే చాపచుట్టేశాయి. ‘బెంగాల్ టైగర్’తో హిట్ అందుకున్న రవితేజ వరుస ప్రాజెక్టులతో బిజీ అయిపోతాడని అనుకుంటే.. అసలు పత్తాలేకుండా పోయాడు.

ఒకానొక టైంలో దర్శకుడు బాబీతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ.. ఆ సినిమా నిర్మాత తప్పుకోవడంతో అది కూడా ఆగిపోయింది. దీంతో.. రవితేజ సినీ కెరీర్ ఏమవుతుందా? అని అందరూ అనుకున్నారు. ఒప్పుకున్న సినిమాలన్నీ రద్దైపోతుండడంతో.. రవితేజ రిటైర్డ్ ప్రకటిస్తారేమోనన్న ప్రచారాలు కూడా జరిగాయి. కానీ.. వాటిని పటాపంచలు చేస్తూ రవితేజ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడని తెలుస్తోంది. 2016లో ఒక్క సినిమా కూడా చేయని రవితేజ.. 2017లో రెండు మూవీలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడట. అందులో ఒకటి అనిల్ రావిపూడితో కాగా.. మరొకటి యంగ్ డైరెక్టర్‌తో చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వారితో చర్చలు కూడా జరిపేశాడని టాక్ వినిపిస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రవితేజ మొదట అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఓ సోషల్ మెసేజ్‌తో కూడిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్‌ని త్వరలోనే ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని టాక్. ఈ మూవీ అనంతరం యంగ్ డైరెక్టర్‌తో రెండు ప్రాజెక్ట్ చేసేలా రవితేజ ప్లాన్ వేశాడట. వీలైనంత వరకు ఈ రెండు సినిమాల్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని రవితేజ అనుకుంటున్నాడట. మొత్తానికి.. గతేడాది ఒక్క సినిమా చేయకుండా ఫ్యాన్స్‌ని నిరాశపరిచిన ఈ మాస్ మహారాజా.. ఈ ఏడాది రెండు సినిమాలతో కిక్ ఇవ్వనున్నాడన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news