Movies‘ధృవ’ క్లోజింగ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. దుమ్మురేపిన రామ్ చరణ్

‘ధృవ’ క్లోజింగ్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్.. దుమ్మురేపిన రామ్ చరణ్

Ram Charan’s latest movie Dhruva closing collections of worldwide report has been out. This movie has earned very well.

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘ధృవ’ సినిమా బాక్సాఫీస్ వద్ద తన పోరాటం ఆపేసింది. పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలోనూ (డిసెంబర్ 9న) ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. అంచనాలకు తగ్గట్టే భారీ వసూళ్లు రాబట్టి చరణ్‌కి ఘనవిజయం అందించింది. వాస్తవానికి డీమోనిటైజేషన్ రోజుల్లో ఇతర సినిమాలన్నీ బోల్తాపడడాన్ని చూసి.. ధృవ కూడా నష్టాల్లో కూరుకుపోతుందని భావించారు. కానీ.. ఈ చిత్రం అందరి అంచనాలకు తిప్పికొట్టింది. రిలీజైన తొలినాళ్లలో ఓ రేంజులో వసూళ్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ.. ఆ తర్వాత వీక్ డేస్‌లలోనూ సంతృప్తికరమైన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్‌కి అతి తక్కువ టైంలోనే చేరుకుంది. దాదాపు చాలా ఏరియాల్లో స్వల్ప లాభాలు తెచ్చిపెట్టింది.. డిస్ట్రిబ్యూటర్లను సేఫ్‌గా బయటపడేసింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా టోటల్ రన్‌లో రూ. 58.04 కోట్లు (షేర్) కలెక్ట్ చేసింది. అందునా.. తెలుగు రాష్ట్రాల నుంచే రూ.41.34 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ఎందుకంటే.. అప్పట్లో ఇక్కడ డీమోనిటైజేషన్ ప్రభావం ఎక్కువగా ఉంది. అయినా.. ఈ చిత్రం ఆ రేంజ్ కలెక్షన్లతో దుమ్మురేపింది. ఇక ఈ సినిమాతో చరణ్ యూఎస్ఏలో తన డ్రీమ్ మార్క్ అయిన 1 మిలియన్ క్లబ్‌లోనూ చేరాడు. ఈ చిత్రానికి అన్నివైపులా నుంచి పాజిటివ్ టాక్ రావడం వల్లే ఇలా వసూళ్ల వర్షం కురిపించి.. కమర్షియల్‌గా హిట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి (కోట్లలో)..

నైజాం : 15.36
సీడెడ్ : 6.90
నెల్లూరు : 1.35
కృష్ణా : 3.00
గుంటూరు : 3.48
వైజాగ్ : 5.45
ఈస్ట్ గోదావరి : 3.15
వెస్ట్ గోదావరి : 2.65
ఏపీ+తెలంగాణ : రూ. 41.34 కోట్లు
కర్ణాటక : 7.35
రెస్టాఫ్ ఇండియా : 1.75
ఓవర్సీస్ : 7.60
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 58.04 కోట్లు (షేర్)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news