News టాప్ డైరెక్టర్‌ సంజాయ్ లీలా బన్సాలీపై దాడి.. సినిమా సెట్‌లోనే...

టాప్ డైరెక్టర్‌ సంజాయ్ లీలా బన్సాలీపై దాడి.. సినిమా సెట్‌లోనే చెంప ఛెళ్లు, పిడిగుద్దులు

rajput karni sena activists attacks on director Sanjay Leela Bansali in padmavathi shooting set claiming that he is showing their Rani in indecent way.

ఓ రియల్ లైఫ్ సంఘటన ఆధారంగా సినిమా తీస్తున్నప్పుడు.. ఎవరో కొందరు ఆకతాయిులు అనవసరంగా దానిపై రచ్చ మొదలుపెట్టేస్తారు. ముందూవెనకా ఏమీ తెలుసుకోకుండా.. తమకు అందిన తప్పుడు సమాచారంతో యూనిట్‌ మీద దాడి చేసేస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పటికే ఎన్నో జరిగాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. దారుణం ఏమిటంటే.. దేశంలో గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన సంజయ్ లీలా బన్సాలీ అనికూడా చూడకుండా ఆయనపై దాడి చేశారు. చెంప దెబ్బలు కొట్టడంతోపాటు పిడిగుద్దులు కూడా గుద్దారు. అసలు ఆయనపై ఎందుకు దాడి చేశారనేగా మీ అనుమానం..? ఆ వివరాలు తెలియాలంటే మేటర్‌లోకి వెళ్ళాల్సిందే.

ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ ‘పద్మావతి’ అనే చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. రాజ్‌పుత్ రాణి ‘పద్మావతి’ నిజ జీవితం ఆధారంగా ఆయన ఈ మూవీ రూపొందిస్తున్నాడు. ఆమెని ఈ చిత్రంలో హీనంగా చూపిస్తున్నాడని రాజ్‌పుత్ కార్ణి సేన కార్యకర్తలకు తెలిసింది. దీంతో.. వాళ్లు ఈ చిత్రబృందంపై దాడి చేశారు. జైపూర్‌లో షూటింగ్ జరుగుతుండగా.. హఠాత్తుగా దూరి వాళ్లు దాడికి పాల్పడ్డారు. సంజయ్‌లీలా బన్సాలీని చెంపదెబ్బలు కొట్టడంతోపాటు పిడిగుద్దులు కురిపించారు. ఈ సినిమా షూటింగ్‌ని ఆపేయమంటూ నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి పోలీసులు దిగడంతో.. ఈ వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనతో యూనిట్ మొత్తం షాక్‌కు గురైంది.

నిజానికి.. ఈ సినిమా తీస్తున్నానని సంజయ్ ఎప్పుడైతే ప్రకటించారో, అప్పటినుంచే దీనికి వ్యతిరేకత మొదలైంది. అలాంటివి సాధారణమే కాబట్టి ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కానీ.. తాజాగా జరిగిన దాడితో ఆయనతోపాటు యూనిట్ సభ్యులు అలర్ట్ అయ్యారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో రాజ్‌పుత్ రాణి ‘పద్మావతి’ పాత్రని దీపికా పదుకొణే పోషిస్తుండగా.. అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news