Newsరవితేజని నిండా ముంచేసిన నిర్మాత బండ్లగణేష్

రవితేజని నిండా ముంచేసిన నిర్మాత బండ్లగణేష్

Producer Bandla Ganesh reveals a shocking news about him, Ravi Teja issue in TNR interview.

బండ్లగణేష్.. ఒకప్పుడు చిన్నచిన్న పాత్రలు చేస్తూ కాలం వెల్లదీసిన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్. కట్ చేస్తే.. ఉన్నపళంగా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్‌గా అవతారమెత్తాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, అల్లుఅర్జున్‌లతో సినిమాలు చేశాడు. అలాంటి బండ్ల.. సడెన్‌గా మాయమైపోయాడు. ‘టెంపర్’ తర్వాత మొత్తానికే కనిపించకుండా పోయాడు. మధ్యలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. ఆ తర్వాత అది రూమరని తేలిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆయన మళ్ళీ మీడియా ముందుకొచ్చాడు.

రీసెంట్‌గానే తాను దేవుడుగా భావించే పవన్‌తో ఫోటో దిగి హల్‌చల్ క్రియేట్ చేసిన బండ్ల.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అందులో భాగంగానే తాను మాస్ మహారాజా రవితేజకి మోసం చేశానని ఓ విషయాన్ని ఒప్పుకున్నాడు. తన దగ్గర నుంచి ఆయనొక పొలం తీసుకున్నాడని.. ఆ విషయంలో తాను రవికి మోసం చేశానని చెప్పుకొచ్చాడు. అయితే.. పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. అవి తెలియాలంటే.. పూర్తి ఇంటర్వ్యూ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news