Movies‘ఖైదీ’ కోసం విదేశీ కార్పొరేట్ కంపెనీ సెలవు.. దటీజ్ మెగాస్టార్ మేనియా

‘ఖైదీ’ కోసం విదేశీ కార్పొరేట్ కంపెనీ సెలవు.. దటీజ్ మెగాస్టార్ మేనియా

A company named Riyad Construction and Trading in Oman country has declared Holiday on Jan11th to watch Khaidi No.150 which features the comeback of Megastar into films after 10 years long gap.

మెగాస్టార్ చిరంజీవికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఎనలేని ఫాలోయింగ్ ఉంది. దశాబ్దకాలం సినిమాలకు గ్యాప్ వచ్చినా.. ఆయన గ్రాఫ్ ఏమాత్రం పడిపోలేదు. ఇంకా తారాస్థాయికి పెరిగిందని చిరు రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ ఆల్రెడీ కొన్ని రికార్డులు క్రియేట్ చేసి నిరూపించింది. తాజాగా మరో ఇన్సిడెంట్ మెగాస్టాన్ మేనియాని చాటిచెప్పింది. ఆయన ప్రతిష్టాత్మక 150వ చిత్రం రిలీజ్ అవుతున్న రోజు.. ఓ కంపెనీ సెలవు ప్రకటించింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల సత్యం. అది కూడా విదేశీ కంపెనీ కావడం విశేషం.

ఒమన్ దేశంలోని రియాద్ కన్‌స్ట్రక్షన్ అండ్ ట్రేడింగ్ అనే ఓ కంపెనీ.. చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ రిలీజ్ సందర్భంగా జనవరి 11వ తేదీన హాలిడే ప్రకటించింది. చిరు దాదాపు దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇస్తుండడం, అదికూడా ఆయన మైల్‌స్టోన్ 150 మూవీ కావడంతో.. ఈ సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. దీన్ని బట్టి.. చిరు మేనియా విదేశాల్లోనూ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. ఇదే కంపెనీ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం కోసం కూడా ఇలాగే సెలవు ప్రకటించింది. దీంతోపాటు బెంగుళూరు, చెన్నైలోని కొన్ని కంపెనీలు సైతం సెలవులు ప్రకటించాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా‘జనతా గ్యారేజ్’ రిలీజ్ రోజున కూడా రెండు, మూడు కంపెనీలు హాలిడే డిక్లేర్ చేశాయి.

కాగా.. ఖైదీ మూవీకి తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌తోపాటు ఇతర ఏరియాల్లోనూ బజ్ బాగా ఉంది. దీంతో.. ఈ చిత్రం గత రికార్డులన్నీ బద్దలయ్యేలా భారీ కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news