Movies ‘లోకల్’ పవర్ చూపించిన నాని.. రెండు రోజుల్లో ట్రైలర్‌కి రికార్డ్...

‘లోకల్’ పవర్ చూపించిన నాని.. రెండు రోజుల్లో ట్రైలర్‌కి రికార్డ్ స్థాయిలో వ్యూస్

Natural star Nani’s latest movie ‘Nenu Local’ trailer gets record views on youtube in just two days.

‘ఈగ’ సినిమాతో నాని రేంజ్ ‘స్టార్’ స్థాయికి పెరిగిపోయింది. ఇక అతడు కూడా ప్రభంజనాలు సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. ఆ అంచనాలు గల్లంతయ్యాయి. అతడు చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాలు కావడంతో.. అతని కెరీర్ గాడిలో పడిపోయింది. అలాంటి టైంలో ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా చేసి, డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీతో కాస్త పుంజుకున్న నాని.. ‘భలే భలే మగాడివోయ్’ మూవీతో భారీ విజయం అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన మరో మూడు మూవీలు కూడా హిట్ అయ్యాయి. దీంతో.. నాని రేంజ్ మళ్ళీ స్టార్ స్థాయికి ఎదిగిపోయింది. ఇందుకు.. ఇతని లేటెస్ట్ మూవీ ట్రైలర్ రాబట్టిన వ్యూసే సాక్ష్యం.

ప్రస్తుతం నాని ‘నేను లోకల్’ అనే సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని త్రినాథ్ రావ్ తెరకెక్కిస్తున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ని రెండురోజుల క్రితం రిలీజ్ చేయగా.. అప్పుడే ఇది 1.5 మిలియన్ మార్క్‌ని అందుకుంది. ఇంత తక్కువ టైంలో అన్ని వ్యూస్ రావడం నాని కెరీర్‌లోనే రికార్డ్. స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో దీనికి వ్యూస్ రావడాన్ని బట్టి.. నాని రేంజ్ ఏ స్థాయికి పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి.. పెద్ద హీరోల సినిమాల ట్రైలర్ల విషయంలో కొన్ని మానుపులేషన్స్ జరుగుతాయి. అలాగే.. ఆయా హీరోల ఫ్యాన్స్ రికార్డుల కోసం పట్టుబట్టిమరీ వ్యూస్ పెంచే ప్రయత్నం చేస్తారు. కానీ.. నాని విషయంలో అలాంటివేమీ ఉండవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. నానిని జనాలు జెన్యూన్‌గా అభిమానిస్తారు. ఆ అభిమానమే ‘నేను లోకల్’ ట్రైలర్‌ను చాలా ఆసక్తిగా చూసేలా చేసింది. దాంతో.. ఈ ట్రైలర్‌కి తక్కువ టైంలోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. చూస్తుంటే.. ఈ సినిమాతో నాని భారీ హిట్ వేసుకోబోతున్నట్లు కనిపిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news