Moviesతెలుగు హీరోల్లో ఆ ఫీట్ సాధించింది మహేష్, నాగార్జునలే!

తెలుగు హీరోల్లో ఆ ఫీట్ సాధించింది మహేష్, నాగార్జునలే!

After Mahesh Babu, King Nagarjuna has also joined in 2 millions followers club on Twitter in Telugu Heroes. SS Rajamouli and Ram Gopal Varma has also 2 millions followers.

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో ప్రతిఒక్కరూ తమ సత్తా చాటుకుంటూ దూసుకెళుతున్నారు. కానీ.. ఒక్క విషయంలో మహేష్ బాబు, నాగార్జునలు అందరినీ వెనక్కు నెట్టేసి.. టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? మరేదో కాదు.. ట్విటర్స్ ఫాలోవర్స్‌లో! ఆ ఇద్దరు హీరోలు ఇప్పుడు ట్విటర్‌లో 2 మిలియన్ ఫాలోవర్స్‌ని కలిగి ఉన్నారు.

ఆ ఫీట్‌ని మహేష్ ఎప్పుడో అందుకున్నాడు. ముందునుంచే అతనికి భారీ క్రేజ్ ఉండడం.. వరుస విజయాలు సాధించడంతో.. ట్విటర్స్‌లో ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది. చివరికి 2 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ సంపాదించుకోగలిగాడు. ఆ తర్వాత ఆ ఫీట్‌ని ఎవరు అందుకుంటారా? అని సందేహం నెలకొనగా.. చివరికి నాగ్ దానికి తెరదించాడు. రీసెంట్‌గానే ఇతను 2 మిలియన్ ఫాలోవర్స్ క్లబ్‌లో చేరిపోయాడు. ‘మనం’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నాగ్.. గతేడాది ‘సోగ్గాడే చిన్ని నాయానా’, ‘ఊపిరి’లతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టడంతో.. ఈతరం ప్రేక్షకుల్లో అతనికి తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. ఆ కారణంగానే.. ట్విటర్‌లో మరో అరుదైన ఫీట్ అందుకున్నాడు.

ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, రామ్ గోపాల్ వర్మలు ట్విటర్‌లో 2 మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉండగా.. ఇప్పుడు నాగార్జున కూడా వీరి సరసన చేరిపోయారు. ఇప్పుడున్న తెలుగు హీరోల్లో మహేష్, నాగార్జున ఇద్దరే ఈ స్థాయిలో ట్విట్టర్ ఫాలోయింగ్‌ను సంపాదించడం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news