Moviesబాలయ్య ఓ అగ్నిపర్వతం.. వెండితెరమీదే కాదు బయట కూడా!

బాలయ్య ఓ అగ్నిపర్వతం.. వెండితెరమీదే కాదు బయట కూడా!

Director Krish praises Balakrishna and compares him with volcano. He wishes GPSK to be a big hit and become an inspiration to whole industry.

గణ రాజ్యాలన్నింటినీ ఏకతాటిపై తీసుకొచ్చి, నూతన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన తొలి తెలుగు చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నిజజీవితం ఆధారంగా తన 100వ చిత్రం చేస్తున్నట్లు బాలయ్య ఏ క్షణం అయితే ప్రకటించారో.. అప్పటినుంచి ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నాయి. అభిమానులే కాదు.. సినీ ప్రముఖుల సైతం బాలయ్య నిర్ణయం అమోఘమంటూ కొనియాడారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కూడా ఆయన్ను తన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు.

‘బాలయ్య వెండితెర మీదే కాదు.. బయట కూడా అగ్నిపర్వతం లాంటివాడు. విభిన్న చిత్రాల్లో ఎలాంటి క్యారెక్టర్‌లోనే ఒదిగిపోయే ప్రముఖ నటుడు. గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తూ వెండితెరను ఎంతో కాలంగా వర్ణరంజితం చేస్తున్నాడు. ఇప్పుడు.. 2000 ఏళ్ల క్రితంనాటి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రూపంలో రెండు రాష్ట్రాల ప్రజల్ని అలరించడానికి వస్తున్నాడు. ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాని రూపొందించిన క్రిష్‌కు అభినందనలు. ఈ సినిమా ఘనవిజయం సాధించి సినీ పరిశ్రమ మొత్తానికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను’ అని కృష్ణవంశీ తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.

ప్రముఖ రచయిత కోన వెంకట్ కూడా ‘శాతకర్ణి’ సినిమాకి విష్ చేస్తూ ఓ పోస్ట్ చేశాడు. ‘ఇప్పుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టైమ్ వచ్చింది. తెలుగు సినిమాకి మంచి రోజులు వచ్చాయి. దర్శకుడు క్రిష్‌, బాలయ్యకు నా ధన్యవాదాలు’ అని తెలిపాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news