Movies‘శాతకర్ణి’ 6 రోజుల యూఎస్ కలెక్షన్స్.. తెలుగోడి సత్తా చాటుతున్న బాలయ్య

‘శాతకర్ణి’ 6 రోజుల యూఎస్ కలెక్షన్స్.. తెలుగోడి సత్తా చాటుతున్న బాలయ్య

Balayya’s 100th movie Gautamiputra Satakarni has earning very well at the US boxoffice. According to the latest updates, this movie has collected $1.32 till monday including premieres.

మాస్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలయ్య.. తెలుగు రాష్ట్రాల్లో తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు కానీ, యూఎస్‌లో మాత్రం ఖాతా తెరవలేకపోయాడు. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘లెజెండ్’ సినిమా కూడా అక్కడ కేవలం 4 లక్షలకుపైగా డాలర్స్ మాత్రమే రాబట్టింది. అంటే.. కనీసం హాఫ్ మిలియన్ మార్క్‌ని క్రాస్ చేయలేకపోయింది. అలాంటి బాలయ్య.. ఇప్పుడు తన ప్రతిష్టాత్మక వందోచిత్రంతో యూఎస్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. ఐదురోజుల్లోనే మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసి.. తన సత్తా చాటాడు. వీక్ డేస్‌లలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. బుధవారం ప్రీమియర్లతో కలుపుకుని సోమవారం దాకా (6 రోజులు) ఈ చిత్రం యూఎస్‌లో $1.32 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. చిరంజీవి కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెం.150’, ‘శతమానం భవతి’ సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ.. వాటికి గట్టిపోటీ ఇస్తూ ‘శాతకర్ణి’ ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం నిజంగా విశేషం. ఈ చిత్రానికి తొలిరోజు పాజిటివ్ రిపోర్ట్స్ రావడం, తెలుగుజాతి గర్వించేలా క్రిష్ అద్భుతంగా తెరకెక్కించడం, ‘శాతకర్ణి’ పాత్రలో బాలయ్య మెప్పించడం వల్లే ఈ చిత్రానికి యూఎస్ జనాలు బ్రహ్మరథం పడుతున్నారని.. అందుకే ఇది కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ వారంలోనే ఈ సినిమా 1.5 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసేలా కనిపిస్తోంది. టోటల్ రన్‌టైంలో 2 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసే అవకాశం కూడా ఉంది.

రోజులవారీగా ‘శాతకర్ణి’ యూఎస్ కలెక్షన్స్ :
బుధవారం : $356,314
గురువారం : $136,707
శుక్రవారం : $173,451
శనివారం : $320,205
ఆదివారం : $236,820
సోమవారం : $90,351
టోటల్ : $1,313,848

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news