Moviesట్యాక్స్ ఎక్సెంప్షన్.. ‘ఖైదీ’ కంటే ‘శాతకర్ణి’కి కలిసొచ్చేది ఎంత?

ట్యాక్స్ ఎక్సెంప్షన్.. ‘ఖైదీ’ కంటే ‘శాతకర్ణి’కి కలిసొచ్చేది ఎంత?

How much tax exemption help for Balayya’s prestigeous project Gautamiputra Satakarni by comparing to Khaidi No 150 collections.

బాక్సాఫీస్‌‌పై యుద్ధం ప్రకటించిన చిరంజీవి, బాలయ్యలు తమ సినిమాలను బ్లాక్‌బస్టర్ హిట్స్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవి వర్గం మొత్తం పూర్తిగా ప్రమోషన్స్ యాక్టివిటీస్‌పైన కాన్సన్‌ట్రేట్ చేసింది. ‘శాతకర్ణి’ యూనిట్ కూడా ఓవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోగా.. మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన బాలయ్య పొలిటికల్ అడ్వాంటేజెస్ కోసం కూడా చూస్తున్నాడు. లక్కీగా చేస్తున్న సినిమా కథ కూడా తెలుగువాడి చరిత్రకు సంబంధించింది కావడంతో ఆయన ఐడియాలు బాగానే వర్కవుట్ అవుతున్నాయి. అందులో భాగంగానే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి ట్యాక్స్ మినహాయించింది. రేపో మాపో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంటుందనడంలో సందేహం లేదు. మరి ఈ మినహాయింపు వళ్ళ గౌతముడికి ఒరిగేదేంటి? ‘ఖైదీ’తో పోలిస్తే బాలకృష్ణ సినిమాకు కలిసొచ్చే రెవిన్యూ ఎంత? పదండి.. ఓ సారి ఆ లెక్కలు చూసుకుందాం..

ఒక టికెట్‌పై బాలయ్య సినిమాకు చిరంజీవి మూవీకంటే అదనంగా ఓ పది రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది. ఆ విధంగా లెక్కలు వేసుకుంటే.. ‘ఖైదీ’కి రూ.1 కోటి షేర్ వస్తే.. ‘శాతకర్ణి’కి అన్నే టిక్కెట్లకు రూ.1.20 కోట్లు షేర్ వస్తుంది. ఈ విషయంలో మాత్రం బాలయ్యదే పైచేయి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఈ ట్యాక్స్ మినహాయింపు అనేది కోటి రూపాయల బడ్జెట్ సినిమాలకు బాగా కలిసొచ్చే అంశమే కానీ పెద్ద సినిమాల విషయంలో మాత్రం మరీ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. ఎందుకంటే.. కొన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలంటే ఖైదీ సినిమా 92.5 కోట్ల వరకూ వసూలు చేయాలి. శాతకర్ణినేమో సుమారు 63 కోట్ల వరకూ వసూలు చేయాలి. అప్పుడే అందరూ గట్టెక్కుతారు. ఆ రేంజ్ కలెక్షన్స్ రావాలంటే.. రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ కావాల్సిందే. ఒకవేళ ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం శాతకర్ణికి కేవలం కంటితుడుపు చర్యకింద ఈ ట్యాక్స్ మినహాయింపు ఉపయోగపడుతుంది తప్ప ఒరిగేదేం ఉండదు. ఈ లెక్కన.. బాక్సాఫీస్ దగ్గర ఎవరు విజేతగా నిలుస్తారో వాళ్ళదే ఫైనల్ కప్ అన్నమాట. చూద్దాం.. ఈ బాహుబలి రేంజ్ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు విజేతగా నిలుస్తారో, ఎవరు మీసం తిప్పుతారో?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news