‘శాతకర్ణి’ ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.. కెరీర్‌లో బెస్ట్ రికార్డ్

gautamiputra satakarni 7 days worldwide collections

Balayya’s 100th Gautamiputra Satakarni first week worldwide collections report is out.

సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా బాక్సాఫీస్‌ని రప్ఫాడించేస్తోంది. బరిలో వున్న మరో రెండు సినిమాలకు ధీటుగా పోటీనిస్తూ.. ఊహించని స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ చారిత్రాత్మక సినిమా రూ.40 కోట్ల క్లబ్‌లోకి చేరి.. వరల్డ్‌వైడ్‌గా బాలయ్య స్టామినా ఏంటో చాటిచెప్పింది.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఫస్ట్ వీక్‌లో రూ. 42.59 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే ఈ చిత్రం రూ.31.49 కోట్లు కొల్లగొట్టింది. కేవలం వారం రోజుల్లోనే ఈ స్థాయిలో వసూళ్లు రావడం బాలయ్య కెరీర్‌లోనే రికార్డ్. ‘ఖైదీ నెం.150’, ‘శతమానం భవతి’ సినిమాల పోటీమధ్య కూడా ఈ చిత్రం ఈ రేంజ్ వసూళ్లతో దూసుకెళ్లడం నిజంగా విశేషం. ఈ రిజల్ట్‌ని బట్టి చూస్తుంటే.. త్వరలోనే ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరిపోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఏరియాల వారీగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (కోట్లలో) :
నైజాం : 7.30
సీడెడ్ : 6.40
వైజాగ్ : 3.95
గుంటూరు : 3.65
వెస్ట్ గోదావరి : 3.06
ఈస్ట్ గోదావరి : 2.98
కృష్ణా : 2.57
నెల్లూరు : 1.58
ఏపీ+తెలంగాణ : రూ. 31.49 కోట్లు
యూఎస్ : 5.60
కర్ణాటక : 3.50
రెస్టాఫ్ ఇండియా+వరల్డ్ : 2.00
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 42.59 కోట్లు

Leave a comment