‘దేశం రెండుగా విడిపోతే బాగుంటుంది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణుపై ఫిర్యాదు

case filed on manchu vishnu

Hyderabad citizen filed case against Manchu Vishnu for making controversial comments on India.

కొందరు సెలబ్రిటీలు అప్పుడప్పుడు కాస్త ఆవేశానికి గురై సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాము మీడియా ముందున్నామన్న విషయాన్ని సైతం విస్మరించి.. ఆ సమయంలో చోటు చేసుకున్న పరిస్థితులకు అనుగుణంగా భావోద్వేగానికి గురై వీరోచిత కామెంట్స్ చేస్తారు. తాజాగా మంచు విష్ణు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీంతో.. అతను కొత్త చిక్కుల్లో పడ్డాడు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు తొలుత‘జల్లికట్టు’ ఉద్యమంపై పాజిటివ్‌గా మాట్లాడాడు. ఆ ఉద్యమం శాంతియుతంగా జరిగింది కాబట్టే అంత విజయం సాధించిందని పేర్కొన్నాడు. కానీ.. అంతలోనే తనకు జల్లికట్టు సమస్యే కాదని, అంతకంటే పెద్ద సమస్య తన దృష్టిలో దేశం రెండుగా విడిపోవడమేనని విష్ణు కుండబద్దలు కొట్టాడు. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్లు దక్షిణాది ప్రజలను, ఉత్తరాది ప్రజలను వేర్వేరుగా చూస్తున్నారని అభిప్రాయం వెల్లడించాడు. నిజానికి.. దక్షిణాది ప్రజల వల్ల ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని, కానీ ఉత్తరాది నుంచి మనకు సరైన గుర్తింపు రావడం లేదని విష్ణు పేర్కొన్నాడు. ఇలా వివక్ష చూపటం కంటే దేశాన్ని రెండుగా చీలిస్తేనే బాగుంటుందని బాంబ్ పేల్చాడు. ఈ విధంగా విష్ణు చేసిన కామెంట్స్ అతడ్ని కొత్త చిక్కుల్లో పడేశాయి.

ఈ హీరో చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ హైదరాబాద్‌లోని నేరేడ్‌మెంట్‌కు చెందిన ఆర్ మణిరత్నం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారిస్తున్నట్లు చెబుతున్నారు.

Leave a comment