Moviesబాలయ్య, చిరు.. అందుకే వాళ్ళు లెజెండ్స్‌రా అబ్బాయ్

బాలయ్య, చిరు.. అందుకే వాళ్ళు లెజెండ్స్‌రా అబ్బాయ్

Balayya and Chiranjeevi are proved themselves as legends once again with their pure friendship during clash of their own prestigeous projects.

ఈ సంక్రాంతి సినిమాల పోటీ యుద్ధాన్నే తలపిస్తోంది. తెలుగు సినిమా రంగానికి చెందిన ఇద్దరు టాప్ రేంజ్ హీరోలు పోటీ పడుతుండడం.. అది కూడా ఇద్దరి కెరీర్‌లోనూ చరిత్రాత్మకంగా నిలిచిపోయే వందో సినిమా, 150వ సినిమాలతో పోటీ పడుతుండడంతో సంక్రాంతి వార్ మరింత రసవత్తరంగా మారింది. మెగా ఫ్యాన్స్, నందమూరి అభిమానుల మధ్య క్లాష్ మామూలుగా లేదు. ఇద్దరు బాక్సాఫీస్ చక్రవర్తులయిన చిరంజీవి, బాలయ్యల కోసం పోటీ పడుతున్న వీరసైనికుల్లాగే అభిమానులు ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో మాటల యుద్ధాలు చేస్తున్నారు. మరి అసలు పోటీదారులు, చక్రవర్తులు అయిన బాలయ్య, చిరులు ఏం చేస్తున్నారు? తెలుసుకోవాలనుందా? అయితే ఈ మేటర్ చదవడం.

బసవతారకరామ పుత్రుడేమో ఖైదీ నంబర్ 150లో ఉన్న నీరు నీరు నీరు అంటూ సాగే రైతులకు సంబంధించిన పాటను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ పాట చాలా బాగుంది.. వినమని తన సన్నిహితులకు కూడా చెప్తున్నాడు. స్వతహాగా రైతులంటే బాలయ్యకు అభిమానం. నిజానికి ‘కత్తి’లో ఉన్న రైతు సమస్య గురించి తెలుసుకుని ఆ సినిమా రీమేక్‌ని కూడా బాలయ్యే చేద్దామనుకున్నాడు. కానీ.. అదే సమయంలో అమరావతి కోసం భూసేకరణ చేస్తూ ఉండడంతో కత్తి సినిమా ఎక్కడ చంద్రబాబు వ్యతిరేకంగా అవుతుందో అని డ్రాప్ అయ్యాడు. ఇప్పుడు కూడా ‘రైతు’ పేరుతో బాలయ్య ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే బాలయ్యకు ఖైదీలో ఉన్న ఆ రైతు పాట అంతగా నచ్చిందట.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా సేం టు సేం. శాతకర్ణి సినిమా ఓపెనింగ్ ఫంక్షన్‌కి కూడా బాలయ్య సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించిన మెగాస్టార్.. ఇప్పుడు ఆ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న క్యూరియాసిటీతో ఉన్నాడట. నిన్న కెసీఆర్‌ని కలిసిన బాలయ్య.. ఆయనకోసం స్పెషల్ షో వేయిస్తానని చెప్పాడు. శాతకర్ణి ఓపెనింగ్ ఫంక్షన్ రోజున చిరంజీవితో కలిసి ఈ సినిమా చూస్తానని కెసీఆర్ అన్నాడు. అందుకే ఇప్పుడు చిరంజీవి కోసం కూడా బాలయ్య ఒక స్పెషల్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అదే విధంగా చిరంజీవి కూడా తన 150వ సినిమాను బాలయ్యకు చూపించాలని ఉన్నాడట.

చిరు, బాలయ్యల స్నేహం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరి ఇళ్ళలో జరిగిన చాలా ఫంక్షన్స్‌లో ఇద్దరూ డ్యాన్సులు చేసిన వీడియోలో యూట్యూబ్‌లో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడీ సినిమాల ప్రదర్శన విషయం కూడా తెలుసుకున్న క్రిటిక్స్ మాత్రం.. అందుకే వాళ్ళిద్దరూ లెజెండ్స్ అయ్యారు అని ఇద్దరినీ ప్రశంసిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news