Moviesకళ్లుచెదిరే రేటుకి ‘బాహుబలి-2’ తమిళ్ రైట్స్.. ఇండియన్ సినిమాలో హిస్టారికల్ రికార్డ్

కళ్లుచెదిరే రేటుకి ‘బాహుబలి-2’ తమిళ్ రైట్స్.. ఇండియన్ సినిమాలో హిస్టారికల్ రికార్డ్

Sri Green Production house has acquired Tamil rights of Baahubali the conclusion for huge price which is said to historical record in Indian cinema.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా ఏ రేంజులో ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఈ చిత్రం.. భాషా బేధం లేకుండా అన్ని పరిశ్రమల ప్రేక్షకుల నుంచి ఆదరణ చూరగొంది. దీంతో.. రెండో భాగంపై తారాస్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో.. ఈ సినిమా హక్కుల్ని కైవసం చేసుకోవడం కోసం డిస్ట్రిబ్యూటర్లతోపాటు నిర్మాతలు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఏ సినిమాకు లేనంతగా పోటీ ఉండడంతో.. భారీ డబ్బులు వెచ్చించేందుకు వాళ్లు ముందుకు వస్తున్నారు. తాజాగా తమిళ రైట్స్ కళ్లుచెదిరే రేటుకి అమ్ముడుపోయాయని సమాచారం.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ‘శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్’ అనే ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ ‘బాహుబలి-2’ తమిళ రైట్స్‌ని అక్షరాల రూ.54 కోట్లకు సొంతం చేసుకుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇంతవరకు ఏ ఒక్క సినిమా రైట్స్ అమ్ముడుపోలేదు. అది కూడా ఇతర పరిశ్రమకి చెందిన సంస్థ అంతమొత్తానికి తీసుకోవడం మరో విశేషం. దీన్ని బట్టి.. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం తమిళ్ రైట్స్ మాత్రమే కాదు.. అటు హిందీలో ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే సోనీ టీవీ నెట్‌వర్క్ ఈ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్‌ని రూ.51 కోట్లకు కొనుకోలు చేసింది. ఓ దక్షిణాది సినిమా రైట్స్‌ని ఈ రేంజు అమౌంట్‌కి తీసుకోవడం ఇదే తొలిసారి. ఇక ఓవర్సీస్ రైట్స్‌కి రూ.48 కోట్లు ధర పలికింది. ఇంకా ఇతర ఏరియాల్లోనూ ఈ చిత్రాన్ని దిమ్మతిరిగే ఆఫర్లు వస్తున్నాయి. వాటన్నంటినీ కలుపుకుంటే.. ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఏ సినిమా చేయని రేంజులో ‘బాహుబలి-2’ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసేలా ఉంది.

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని శరవేగంగా జరుపుకుంటోంది. వీలైనంత త్వరగా వాటిని ముగించేసి.. ట్రైలర్‌ని విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. ముందుగా ప్రకటించినట్లుగానే.. ఏప్రిల్ 28వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి కాబట్టి.. కచ్ఛితంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news